Woman Safely Delivers: నడిరోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయిన నిండు గర్బిణి.. మహిళకు పురుడు పోసిన ముంబై పోలీసులు

| Edited By: Balaraju Goud

Apr 14, 2021 | 3:15 PM

రోడ్డుపై దిక్కుతోచనిస్థితిలో ఉన్న ఆ మహిళకు పోలీసులు దిక్కయ్యారు. నిస్సహస్థితిలో ఉన్న నిండు గర్బిణికి పోలీసులు అండగా నిలిచారు.

Woman Safely Delivers: నడిరోడ్డుపై సొమ్మసిల్లిపడిపోయిన నిండు గర్బిణి.. మహిళకు పురుడు పోసిన ముంబై పోలీసులు
Woman Safely Delivers Baby Girl Inside Mumbai Police Van
Follow us on

Woman Safely Delivers in Police Van: రోడ్డుపై దిక్కుతోచనిస్థితిలో ఉన్న ఆ మహిళకు పోలీసులు దిక్కయ్యారు. నిస్సహస్థితిలో ఉన్న నిండు గర్బిణికి పోలీసులు అండగా నిలిచారు. కఠినంగా వ్యవహరించే పోలీసుల్లోనూ మానవత్వం ఉందని నిరూపించారు ముంబై పోలీసులు. మహిళను ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు రావడంతో పోలీసులు కాన్పు చేశారు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఘటన వర్లీనాకా ప్రాంతంలో చోటుచేసుకుంది.

వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కి ఫోన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిండు గర్భిణిగా ఉన్న ఆమెని వెంటనే పోలీసు వ్యాన్‌ లో స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో మహిళా పోలీసులు ఆమెకి ప్రసవం చేశారు. అనంతరం తల్లీ, బిడ్డలను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.


7వ నెల్లోనే ఆ గర్భిణి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. పోలీసులు అంబులెన్స్‌ కోసం ఎదురుచూడకుండా తమ వ్యాన్‌ లోనే హాస్పిటల్‌ కి తరలించడంతో తల్లీ, బిడ్డా ప్రాణాలు దక్కాయి. జిజామత్‌ ప్రాంతానికి చెందిన మహిళగా ఆమెని గుర్తించారు.కాగా సకాలంలో స్పందించిన పోలీసులు తీరుపట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కిరాతకుల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కష్టాల్లో ఉన్నవారి పట్ల కారుణ్యం చూపించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.

Read Also…

Maharashtra Coronavirus : మహారాష్ట్రలో ఈ రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ తరహా నిబంధనలు, కరోనా కట్టడికి మరాఠా పాట్లు 

ARIES Astronomers: భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ఘనత.. 200లకు పైగా కొత్త నక్షత్రాల గుర్తింపు..