Gold Price Today(02-02-21) : తగ్గుతున్న బంగారం ధరలు.. గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!

| Edited By: Anil kumar poka

Feb 02, 2021 | 9:03 AM

కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి..

Gold Price Today(02-02-21) : తగ్గుతున్న బంగారం ధరలు.. గత నెలనుంచి ఎంత ధర తగ్గిందో తెలుసా..!
Follow us on

Gold Price Today(02-02-21) : కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం లో బడ్జెట్ లో బంగారం పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయని నిఫుణులు చెప్పారు. ఇప్పటికే సోమవారం బంగారం
ధర తగ్గగా వెండి ధర మాత్రం పెరిగింది.

ఈ నేపథ్యంలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,500 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,550 ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ ధర రూ 320 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,640లు గా కొనసాగుతుంది.

అయితే ప్రస్తుతం బంగారం కొనవచ్చా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.. తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం బంగారం ధరలు మరింత దిగిరానున్నాయని.. కొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 6న 22 క్యారెక్ట్స్ బంగారం ధర రూ. 48000 ఉంటే తాజాగా రూ. 45,500 లు ఉంది. అంటే గత 25 రోజుల్లో దాదాపు రూ.2500 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే బంగారు నగలు కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్ళీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

Also Read: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత