Dream: కలలో నీరు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.? మంచికా, చెడుకా.?

|

Aug 29, 2024 | 11:50 AM

కలలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి. అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో నీరు కనిపించే విధానం ఆధారంగా, దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, చెరువు, నది, నిలకడగా ఉన్న నీరు.. ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అవేంటంటే..

Dream: కలలో నీరు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.? మంచికా, చెడుకా.?
Dream
Follow us on

కలలో కనిపించే వస్తువులు, మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే కేవలం శాస్త్రమే కాకుండా సైన్స్ సైతం దీనిని నిజమని చెబుతోంది. స్వప్నశాస్త్రం ప్రకారం మన కలలో వచ్చే ప్రతీ అంశానికి ఒక కారణం ఉంటుందని అంటున్నారు. మన ప్రమోయం లేకుండా మనకు వచ్చే కలలు.. వాస్తవిక జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటుంటారు.

కలలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి. అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో నీరు కనిపించే విధానం ఆధారంగా, దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, చెరువు, నది, నిలకడగా ఉన్న నీరు.. ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అవేంటంటే..

కలలో మురికి నీరు కనిపిస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల త్వరలోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదే మంచి నీరు కనిపిస్తే మాత్రం చాలా మంచిదని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక ఒకవేళ ఆ నీటిలో రంగురంగు పుష్పాలు ఉంటే మరీ మంచిదని పండితులు అంటున్నారు. దీనివల్ల మీ భవిష్యత్తు రంగురంగులుగా ఉండనుందని అర్థం చేసుకోవాలి.

ఒకవేళ మీరు నీటిలోకి మురికితో అడుగు పెడుతున్నట్లయితే మీకు మీరే స్వయంగా అవకాశాలను దూరం చేసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ కల వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. నీరు మాయవుతున్నట్లు కనిపిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. అలాగే కలలో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తే.. మీ జీవితం సాఫీగా సాగనుందని అర్థం చేసుకోవాలి. ఏవైనా కష్టాలు ఎదురవుతున్నా వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కోగలరని శాస్త్రం చెబుతోంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..