Gaju Theega: కంపల్లో పెరుగుతుందని పిచ్చి తీగ అనుకునేరు.. ఇది దొరికితే మీది అదృష్టమే

|

Jul 27, 2024 | 6:59 PM

కంచెల‌కు, రేగి చెట్ల‌కు ఈ తీగ మొక్క ఎక్కువ‌గా అల్లుకుని పెరుగుతుంటుంది. గాజు తీగ మొక్క ఆకులు యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఈ మొక్క మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

Gaju Theega: కంపల్లో పెరుగుతుందని పిచ్చి తీగ అనుకునేరు.. ఇది దొరికితే మీది అదృష్టమే
Gaju Teega
Follow us on

గ్రామాల్లో అయితే మన ఇళ్ల పక్కన రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. మనం పిచ్చి మొక్కలు అనుకోని వాటిని పీకేస్తూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని మొక్కలు.. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రతి మెడిసిన్ చెట్ల బెరడు, ఆకులు, పండ్ల నుంచి తీసినదే అయి ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మంచి మెడిసిన్ వాల్యూ ఉన్న ఓ తీగ గురించి చెప్పబోతున్నాం. అదే గాజు తీగ. దీన్ని బుట్ట బుడస, బంగారు తీగ, బుబ‌టి తీగ మొక్క, తెల్ల జుంకీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ తీగకు కాయలు కూడా కాస్తాయి. ఈ తీగ ఆకులే కాకుండా.. కాయల్లో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నవారు.. ఈ చెట్టు ఆకులను ఎండబెట్టి.. కషాయం చేసుకుని తాగినే చాలా రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారు. అలానే దగ్గు, కఫం, ఊపిరితిత్తుల్లో వచ్చే నిమ్ము, జలుబు సమస్యలు నుంచి స్వాంతన చేకూరుస్తుందట. ఆకులు శుభ్రంగా కడిగిన తర్వాత.. కొన్ని మిరియాలు వేసి… పేస్ట్‌లా చేసి తలకు రాసుకుంటే.. తలనొప్పి తగ్గుతందట. ఇక ఈ తీగ వేర్లను పలు రకాల ఔషధాల తయరీలో వినియోగిస్తారట. ఈ మొక్క ఆకులకు యాంటీబయోటిక్ లక్షణాలు ఉన్నాయి.  గ‌జ్జి, తామ‌ర, దురద వంటి చర్మ సంబంధిత వ్యాధులు.. అనేక ఇన్ఫెక్షన్స్, వ్యాధుల బారిన పడకుండా ఈ ఆకు కాపాడుతుంది.

(NOTE: నిపుణుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..