Breaking News : క్షీణిస్తున్న బాల సుబ్రమణ్యం ఆరోగ్యం

గాన గంధర్వుడు SPబాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై మరోసారి టెన్షన్‌ మొదలైందిఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. . బాలు ఆరోగ్యం విషమించిందన్న వార్తలు అభిమానుల్లో

Breaking News : క్షీణిస్తున్న బాల సుబ్రమణ్యం ఆరోగ్యం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 6:17 PM

SP Bala subrahmanyam :  గాన గంధర్వుడు SPబాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై మరోసారి టెన్షన్‌ మొదలైందిఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. . బాలు ఆరోగ్యం విషమించిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై మరికాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు.

SP బాలసుబ్రమణ్యం కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. వైద్యులు విడుదల చేసే హెల్త్‌ బులెటిన్‌పై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 40 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలు. ఈనెల 19నుంచి ఎలాంటి వైద్యులు ఎలాంటి హెల్త్‌ బులెటిన్ విడుదల చేయలేదు.

ఈ నెల 19 వరకూ డాక్టర్లు హెల్త్ బులెటిన్ ఇచ్చారు. 22న అంటే మొన్న ఎస్పీ చరణ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాశారు. అంటే దాదాపు కోలుకున్నట్లే అని.. రేపో మాపో డిశ్చార్జ్ అని భావించారంతా. కానీ.. ఈలోగా ఆయన మళ్లీ ఆస్త్వస్థతకు గురయ్యారన్న వార్తలు యావత్ భారతావనిని మళ్లీ ఆందోళనలో పడేశాయి. బాలు చివరిసారిగా విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చూద్దాం.