తప్పక గెలుస్తాం: హీరో రాజశేఖర్

|

Mar 08, 2019 | 10:23 AM

హైదరాబాద్: మా ఎన్నికలు వేడెక్కాయి. ప్రచారం ఊపందుకుంది, ఆరోపణలు ప్రత్యారోపణలతో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివాజీరాజీ, నరేశ్ వర్గం పోటీపడుతుండగా నరేశ్ వర్గం తరుపున హీరో రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమని మొదట తనను నరేశ్ అడిగినప్పుడు తనకు భయమేసిందని, కానీ పలువురికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పుడిక తప్పక గెలుస్తామన్న నమ్మకం తనకు కలిగిందని రాజశేఖర్ అన్నారు. తాను మా ఎన్నికల్లో […]

తప్పక గెలుస్తాం: హీరో రాజశేఖర్
Follow us on

హైదరాబాద్: మా ఎన్నికలు వేడెక్కాయి. ప్రచారం ఊపందుకుంది, ఆరోపణలు ప్రత్యారోపణలతో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివాజీరాజీ, నరేశ్ వర్గం పోటీపడుతుండగా నరేశ్ వర్గం తరుపున హీరో రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమని మొదట తనను నరేశ్ అడిగినప్పుడు తనకు భయమేసిందని, కానీ పలువురికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పుడిక తప్పక గెలుస్తామన్న నమ్మకం తనకు కలిగిందని రాజశేఖర్ అన్నారు.

తాను మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం నరేశ్. మా అమ్మ పోయాక ఒంటరితనాన్ని అనుభవించాను. ఇంటి నుంచి బయటకు రాలేకపోయాను. ఒత్తిడిలో ఉన్న సమయంలో నరేశ్ వచ్చి మా ఎన్నికల ప్రస్తావన తెచ్చి కలిసి పని చేద్దాం, ఇదే సరైన సమయం అని చెప్పినట్టు రాజశేఖర్ చెప్పారు.