Tollywood: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కానీ ఆ విషయమే మర్చిపోయిందట..

|

Jul 27, 2024 | 1:04 PM

సినిమాల పరంగా నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే ఈ బ్యూటీ పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు బయటకు రానివ్వదు. కొందరు హీరోయిన్ తమ వ్యక్తిగత విషయాలను నెట్టింట చాటింపు వేస్తే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం ప్రైవసీ మెయింటైన్ చేస్తుంది. ఆఖరకు తన ఫెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ ఇప్పుడు తనకు పెళ్లైందనే విషయమే మర్చిపోయిందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా..?

Tollywood: పదేళ్ల ప్రేమ.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. కానీ ఆ విషయమే మర్చిపోయిందట..
Actress
Follow us on

తెలుగు సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి తెరంగేట్రం చేసిన ఓ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ అందుకున్న ఆ బ్యూటీ.. అనుహ్యంగా బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. సినిమాల పరంగా నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే ఈ బ్యూటీ పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు బయటకు రానివ్వదు. కొందరు హీరోయిన్ తమ వ్యక్తిగత విషయాలను నెట్టింట చాటింపు వేస్తే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం ప్రైవసీ మెయింటైన్ చేస్తుంది. ఆఖరకు తన ఫెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కానీ ఇప్పుడు తనకు పెళ్లైందనే విషయమే మర్చిపోయిందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా..? తనే హీరోయిన్ తాప్సీ పన్నూ..

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవలే తన ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ఏడడుగులు వేసింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కొన్ని నెలల క్రితం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈబ్యూటీ పెళ్లికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే తిరిగి బిజీ అయ్యింది.

ప్రస్తుతం ఖేల్ ఖేల్ మే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ నుంచి హాలి హాలి అనే పాటను గురువారం సాయంత్రం రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తున్న తాప్సీని చూసిన ఓ ఫోటోగ్రాఫర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అదేంటీ ? మూవీ రిలీజ్ కాకముందే హిట్టయిందా ? అని సరదాగా అడిగింది. కాదు.. పెళ్లి గురించి విష్ చేస్తున్నాను అని చెప్పడంతో పెళ్లి గురించి కంగ్రాట్స్ చెప్తున్నావా..? నాకు వివాహమైందన్న విషయం నేనే మర్చిపోయాను అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.