Ram Charan: రామ్ చరణ్‏కు అరుదైన గౌరవం.. ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్..

|

Apr 11, 2024 | 5:17 PM

ఏప్రిల్ 13వ తేదీన జరగనున్న యూనివర్శిటీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా రానున్నారు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలో అత్యద్భుతమైన సేవలందించినందుకు గాను వెల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ ఏడాది ఈ వేడుకలకు సినీ నిర్మాత, యూనివర్సిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రభావం చూపించాడు. అద్భుతమైన నటనా ప్రతిభ, మనోహరమైన స్వభావం కోట్లాది మంది ప్రజలకు దగ్గర చేసింది.

Ram Charan: రామ్ చరణ్‏కు అరుదైన గౌరవం.. ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్..
Ram Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ మారుమోగుతుంది. ట్రిపుల్ ఆర్ మూవీలో తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్‏ను సైతం ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్‏గా ఎన్నో అవార్డులు, రికార్డ్స్ అందుకున్న చరణ్.. మరో అరుదైన గౌరవం అందుకున్నారు. చెన్నైలోని యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ కాన్వొకేషన్ వేదికగా ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరగనున్న యూనివర్శిటీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా రానున్నారు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలో అత్యద్భుతమైన సేవలందించినందుకు గాను వెల్స్ యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ ఏడాది ఈ వేడుకలకు సినీ నిర్మాత, యూనివర్సిటీ ఛాన్సలర్ ఈసరి గణేష్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రభావం చూపించాడు. అద్భుతమైన నటనా ప్రతిభ, మనోహరమైన స్వభావం కోట్లాది మంది ప్రజలకు దగ్గర చేసింది.

2007లో చిరుత సినిమాతో మొదలైన చెర్రీ ప్రయాణం ఇప్పుడు అద్భుతమైన నటనతో హాలీవుడ్ స్థాయిని చేరింది. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. గతేడాది వేల్స్ యూనివర్సిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డైరెక్టర్ శంకర్‏లకు ప్రతిష్టాత్మక డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్‏కు గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. ఇకపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. డాక్టర్ రామ్ చరణ్. దీంతో సోషల్ మీడియా వేదికగా చెర్రీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ వేడుకల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం పాల్గొని చెర్రీకి గౌరవ డాక్టర్ అందచేయనున్నారు.

ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్ , అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.