Tollywood: ఆ స్టార్ హీరో సినిమా వేడుకకు ప్రత్యేక రైళ్లు.. లక్షల మంది అభిమానుల సందడి..

|

Sep 01, 2024 | 1:25 PM

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు తారక్. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనపై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తారక్ నటిస్తోన్న దేవర ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.

Tollywood: ఆ స్టార్ హీరో సినిమా వేడుకకు ప్రత్యేక రైళ్లు.. లక్షల మంది అభిమానుల సందడి..
Actor
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన తెలుగు హీరో. ఆయన సినిమాలు విడుదలైతే థియేటర్లు దద్ధరిల్లాల్సిందే. చిన్నవయసులోనే సినీరంగంలోకి బాలనటుడిగా అడుగుపెట్టి.. హీరోగా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిందే. 8 ఏళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రేవేశం చేశాడు. ఆది సినిమాతో యాక్షన్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అదుర్స్ మూవీతో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు తారక్. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనపై హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తారక్ నటిస్తోన్న దేవర ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తారక్ సినిమా వేడుక కోసం రైల్వే శాఖ ఏకంగా 9 రైళ్లను కేటాయించింది. అవును. ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను కూడా కేటాయించింది.

2004లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా చిత్రం విడుదలైంది. ఈ సినిమా మ్యూజిక్ లాంచ్ జూనియర్ ఎన్టీఆర్ స్వగ్రామంలో జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దాదాపు 10 లక్షల మంది అభిమానులు తరలివచ్చారు. 2000 మంది జనాభా ఉన్న ఆ పట్టణంలో, 10 లక్షల మంది ప్రజలు చేరుకున్నారు.ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం రైల్వే శాఖ 9 ప్రత్యేక రైళ్లను, పలు ప్రత్యేక బస్సులను నడిపింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అప్పట్లో తారక్ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా పది లక్షల మంది హాజరయ్యారు.

11 ఏళ్లుగా అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 2013 చిత్రం బాద్ షా మ్యూజిక్ లాంచ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఉత్సాహంగా ఉన్న జనం తొక్కిసలాటకు దారితీసింది. అందులో ఓ అభిమాని చిక్కుకుని చనిపోయాడు. ఈ ఘటన జూనియర్ ఎన్‌టీఆర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అనంతరం మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని స్వయంగా కలుసుకుని ఐదు లక్షల రూపాయలు చెల్లించి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఘటన జరిగి నేటికి 11 ఏళ్లు. ఇప్పటికీ చనిపోయిన అభిమాని కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆదుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.