Sapthami Gowda: నాన్న దారిలో పోలీస్ కావాలనుకున్నాను.. అనుకోకుండా ఇలా.. కాంతార హీరోయిన్..

|

Apr 24, 2024 | 7:08 AM

ఆమె బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. కాంతార తర్వాత హిందీలో ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో నటిస్తుంది. అలాగే యువ, కాశి, కాంతార ప్రీక్వెల్ చిత్రాల్లో కనిపించనుంది. ప్రస్తుతం సప్తమి నటిస్తున్న అన్ని సినిమాలు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీ కోసం ఇప్పుడే గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Sapthami Gowda: నాన్న దారిలో పోలీస్ కావాలనుకున్నాను.. అనుకోకుండా ఇలా.. కాంతార హీరోయిన్..
Sapthami Gowda
Follow us on

కన్నడ టాప్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ముందుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఇందులో లీల పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమె బాలీవుడ్ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. కాంతార తర్వాత హిందీలో ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో నటిస్తుంది. అలాగే యువ, కాశి, కాంతార ప్రీక్వెల్ చిత్రాల్లో కనిపించనుంది. ప్రస్తుతం సప్తమి నటిస్తున్న అన్ని సినిమాలు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీ కోసం ఇప్పుడే గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కాంతార తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని.. కానీ మనసుకు నచ్చిన సినిమాలే చేసేందుకు ఒప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. పాత్ర వరకు మాత్రమే కాకుండా కథపైనా కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. ఫ్యామిలీతో కలిసి కథ వింటానని.. ఆ తర్వాత ధనంజయ్, సంతోషన్ ఆనంద్ రాయ్, విజయ్ కిరంగదూర్ వంటి ప్రముఖుల సలహాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తెలుపుతానని వివరించింది.

“మా తండ్రి ఎస్కే ఉమేష్ పోలీసు శాఖలో పనిచేశారు. చదువులోనూ ముందు ఉండేదాన్ని. అలాగే క్రీడల్లోనూ రాణించాను. నేను యూపీఎస్సీ కోసం ప్రయత్నంచినట్లయితే కచ్చితంగా ఉత్తీర్ణురాలిని అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి చాలా ఫోకస్ కావాలి. నేను అనుకోకుండా నటిగా మారాను. పాప్ కార్న్ మంకీ టైగర్ సినిమా గురించి మాట్లాడేందుకు సూరి సార్ మా తండ్రి వద్దకు వచ్చారు. అప్పుడు నన్ను చూసి నువ్వేందుకు ఆ పాత్ర చేయకూడదు అని అడిగారు. అలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను ” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.