Kamal Haasan: లోకనాయకుడు అంటే ఆమాత్రం ఉండాల్సిందే.. కమల్ హాసన్ సంపాదన ఎంత ఉంటుందో తెలుసా ?..

|

Nov 07, 2023 | 9:41 AM

దాదాపు నాలుగు సంవత్సారాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కమల్.. విక్రమ్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో విక్రమ్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి సినిమా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు నెట్టింట కమల్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అడియన్స్.

Kamal Haasan: లోకనాయకుడు అంటే ఆమాత్రం ఉండాల్సిందే.. కమల్ హాసన్ సంపాదన ఎంత ఉంటుందో తెలుసా ?..
Kamal Haasan Net Worth
Follow us on

కమల్ హాసన్.. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. ఎన్నో చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా.. నిర్మాతగా.. టీవీ వ్యాఖ్యాత, రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాగే విలక్షణమైన పాత్రలతో కొన్ని దిగ్గజ చిత్రాలలో నటించిన ఆయన భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. బాలీవుడ్‌లో కూడా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ గతేడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దాదాపు నాలుగు సంవత్సారాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కమల్.. విక్రమ్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో విక్రమ్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి సినిమా అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు నెట్టింట కమల్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అడియన్స్.

నివేదికల ప్రకారం కమల్ హాసన్.. ఇప్పటివరకు దాదాపు రూ.177 కోట్లు సంపాదించినట్లు సమాచారం. అలాగే లగ్జరీ ప్రాపర్టీలు, కార్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో, కమల్ హాసన్ ఖరీదైన వస్తువులను కలిగి ఉన్నాడు. కమల్.. ఆకట్టుకునే రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నారు. అతను చెన్నైలో ఒక విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నాడు. అలాగే చెన్నైలో 19.5 కోట్ల రూపాయల విలువైన రెండు ఫ్లాట్‌లను కలిగి ఉన్నాడు. చెన్నైలో ఆయనకు అనేక వాణిజ్య, నివాస ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ రూ.92.5 కోట్లు సమాచారం.

హాసన్‌కు లండన్‌లో ఖరీదైన ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి ధర రూ.2.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక కమల్ హాసన్ వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. BMW 730LD, లెక్సస్ Lx 570, ఇతరత్రా కలిగి ఉన్నాడు. వాటి ధర రూ.3.69 కోట్లు. కమల్ హాసన్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు తీసుకుంటాడు. విక్రమ్ కోసం రూ. 50 కోట్లు వసూలు చేశాడు . ప్రస్తుతం బిగ్ బాస్ షో కోసం 150 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.