Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇలా మారిపోయింది ఏంటి..? ఇప్పుడు హీరోయిన్

|

Aug 29, 2024 | 8:53 AM

3, 4 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన అమ్మాయిలు.. అనతి కాలంలోనే హీరోయిన్స్ అయిపోతున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. రాక్షసుడు మూవీలో హీరో.. మేనకోడలిగా నటించిన పాప గుర్తుందా..? తను ఇప్పుడు హీరోయిన్..

Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇలా మారిపోయింది ఏంటి..? ఇప్పుడు హీరోయిన్
Ammu Abhirami
Follow us on

తెలుగునాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మాములుగా లేదు.   వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తనయుడు.. జయ జానకి నాయక సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. అయితే తమిళ్ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే సినిమా చేశాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా అతడి కెరీర్‌లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు.  ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకులు ప్రశంసలు అందుకుంది.  కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన పాప గుర్తుందా..? ఆ పాప చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది. తన పేరు అభిరామి. రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. అంతే కాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది. విద్యా సాగర్ రాజు డైరెక్ట్ చేసిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) మూవీలో నటించింది.

ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఇంతలోనే హీరోయిన్ అయిపోయింది. మణిరత్నం తెరకెక్కించిన “నవరస” వెబ్ సిరీస్ అభిరామి నటించింది. ఆమె హీరోయిన్‌గా మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలు, సినిమా అప్‌డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..