హోరాహోరీగా మా ఎన్నికలు.. నరేశ్‌పై శివాజీ రాజా ఫైర్

|

Mar 08, 2019 | 10:24 AM

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గత కొంత కాలంగా హాట్‌గా జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఆ పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నటుడు నరేశ్, ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇరు వర్గాలు గెలుపు కోసం ప్రచారం స్పీడు పెంచారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే శివాజీ రాజా గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేశ్ వర్గం చేసే వ్యాఖ్యలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం […]

హోరాహోరీగా మా ఎన్నికలు.. నరేశ్‌పై శివాజీ రాజా ఫైర్
Follow us on

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గత కొంత కాలంగా హాట్‌గా జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఆ పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ నటుడు నరేశ్, ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజా మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఇరు వర్గాలు గెలుపు కోసం ప్రచారం స్పీడు పెంచారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే శివాజీ రాజా గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేశ్ వర్గం చేసే వ్యాఖ్యలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉండటం వల్లే మీడియా సమావేశం ఉందని చెప్పారు. నరేశ్ ప్యానల్ మీడియా ముందుకెళ్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండటంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని శివాజీ అన్నారు.

ఇష్టంలేకుండానే ఈసారి పోటీ చేస్తున్నానని శివాజీ అన్నారు. నరేష్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎప్పుడూ సహకరించలేదు. గతంలో నిధులు కావాల్సినప్పుడు చిరంజీవి గారితో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే రిహార్సల్స్ కు రాలేదు. నా పుట్టినరోజు నాడు నన్ను చాలా ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించాడు. జీవిత లాంటి వాళ్లు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివాజీరాజా.