మాస్ మహారాజా రవితేజ చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తర్వాత ఇంతవరకు మరో హిట్ ను అందుకోలేక పోయాడు రవితేజ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనేసినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రవితేజ తన పాత్రకు డబ్బింగ్ ను మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Dubbing in process #KRACK pic.twitter.com/qDfMHseqgS
— Ravi Teja (@RaviTeja_offl) December 29, 2020