రవితేజ మూవీలో రాశి స్పెషల్ మెరుపులు..!

| Edited By:

Jul 07, 2020 | 8:38 PM

ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాలో నటిస్తోన్న రవితేజ, ఆ తరువాత రమేష్ వర్మ డైరెక్షన్‌లో నటించబోతున్నారు.

రవితేజ మూవీలో రాశి స్పెషల్ మెరుపులు..!
Follow us on

ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్‌ సినిమాలో నటిస్తోన్న రవితేజ, ఆ తరువాత రమేష్ వర్మ డైరెక్షన్‌లో నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. పరిస్థితులు కాస్త సర్దుకున్నాక ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక ఇందులో హీరోయిన్లుగా నబా నటేష్‌, నిధి అగర్వాల్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఇందులో స్పెషల్ పాటలో రాశిఖన్నా మెరవనున్నట్లు టాక్‌. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? స్పెషల్ సాంగ్‌కు రాశి ఓకే చెప్తుందా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా రవితేజ హీరోగా నటించిన బెంగాల్‌ టైగర్‌, టచ్‌ చేసి చూడు చిత్రాల్లో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ నటి కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.