Devara: దేవర ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు.. అప్పుడే మొదలైన రికార్డుల వేట

పాన్‌ ఇండియా రేంజ్‌లో విడులవుతోన్న ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్‌ను సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది...

Devara: దేవర ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు.. అప్పుడే మొదలైన రికార్డుల వేట
Devara Movie
Follow us

|

Updated on: Sep 07, 2024 | 2:22 PM

ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ అభిమానులే కాకుండా, యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆచర్యం వంటి ఫ్లాప్‌ తర్వాత ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

పాన్‌ ఇండియా రేంజ్‌లో విడులవుతోన్న ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్‌ను సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇక ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ రోల్‌లో నటిస్తుండడంతో బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుటి వరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

కాగా చిత్ర యూనిట్ అభిమానులకు తాజాగా వినాయక చవితిని పురస్కరించుకొని శుభవార్త తెలిపింది. ఈ మూవీ ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌ చేసింది. సెప్టెంబర్‌ 10వ తేదీన బిగ్‌స్క్రీన్‌పై ‘దేవర’ ట్రైలర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉండే ఈ ట్రైలర్‌ అభిమానులను కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

దేవర గ్లింప్స్..

ఇక దేవర చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా ప్రీసేల్‌లో సత్తా చాటింది. అత్యధిక టికెట్స్‌ అమ్ముడయినట్లు చిత్రబృందం తెలిపింది. 5లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు టీమ్‌ చెప్పింది. దీంతో దేవరపై ఏ రేంజ్‌లో క్యూరియాసిటీ ఉందో ఇదే చెబుతోంది. మరి దేవర అంచనాలను ఏ మేర అందుకుంటుందో తెలియాంటే విడుదల వరకు వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!