పవన్‌కి హీరోయిన్ ఫిక్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన!

'గబ్బర్‌సింగ్' కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవ్వబోతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ చిత్రంలో నటిస్తుండగా

పవన్‌కి హీరోయిన్ ఫిక్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన!
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2020 | 12:23 PM

Heroine for Pawan Kalyan: ‘గబ్బర్‌సింగ్’ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవ్వబోతున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ చిత్రంలో నటిస్తుండగా.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా  బుధవారం విడుదలైంది. ఈ చిత్రం సామాజిక కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు ఆ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ పాత్రను హరీష్ బలంగా రాశారని, ఆయన పొలిటికల్‌ కెరీర్‌కి సైతం ఈ మూవీ బూస్టప్ ఇస్తుందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

హరీష్ దర్శకత్వం వహించిన ‘డీజే’, ‘వాల్మీకి’ చిత్రాల్లో పూజా నటించగా.. ఆ రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు అదే హీరోయిన్‌ని పవన్ కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ ఆఫర్‌పై పూజా హ్యాపీగా ఫీల్ అయ్యిందని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ జోడీని ప్రేక్షకులు చూడనున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Read More:

 ‘ఇంగ్లీష్ మీడియం’పై సుప్రీం విచారణ.. ‘స్టే’కు నిరాకరణ

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి