Animal Park: యానిమల్ పార్క్ పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్.. షూటింగ్ అప్పుడే..

ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. సినీ ప్రముఖుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రెటీలు ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం హిందీ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా కథ నుంచి రణబీర్ లుక్స్ వరకు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా తదుపరి భాగం యానిమల్ పార్క్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Animal Park: యానిమల్ పార్క్ పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్.. షూటింగ్ అప్పుడే..
Animal Park Movie
Follow us

|

Updated on: Apr 20, 2024 | 4:10 PM

గతేడాది విడుదలైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మాస్ యాక్టింగ్ చూసి షాకయ్యారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు స్మార్ట్ బాయ్ గా కనిపించిన రణబీర్ మాస్ నటవిశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో రణబీర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. సినీ ప్రముఖుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. సౌత్, నార్త్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రెటీలు ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం హిందీ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా కథ నుంచి రణబీర్ లుక్స్ వరకు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా తదుపరి భాగం యానిమల్ పార్క్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా సెకండ్ పార్ట్ యానిమల్ పార్క్ వచ్చే ఏడాది అంటే 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రూమర్స్ నెట్టింట వైరలయ్యాయి. అయితే ఇప్పుడు రణబీర్ సినిమా కోసం ప్రేక్షకులు మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడారు. 2026లో యానిమల్ పార్క్ షూటింగ్ ప్రారంభిస్తానని వెల్లడించాడు.

సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. అతని బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, సీక్వెల్ యానిమల్ కంటే పెద్దదిగా, వైల్డ్‌గా ఉండబోతోందని దర్శకుడు చెప్పాడు. ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ, 2026 నాటికి యానిమల్ పార్క్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు యానిమల్ పార్క్ అప్టేడ్ నిరాశపరిచింది. ఈ మూవీ మరింత ఆలస్యం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles