జక్కన్న సినిమా.. ఎన్ని భాషల్లో చూడాలంటే ?

| Edited By: Srinu

Nov 21, 2019 | 7:14 PM

ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా పది.. ఇదేదో జూనియర్ కాలేజ్ ర్యాంకింగ్స్ యాడ్ లా కనిపించినా విషయం వేరు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా పది భాషల్లో ధియేటర్లలో విడుదల కాబోతుందట. ఇప్పటికే అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్ లాంటి స్టార్ స్టడెడ్ కాస్టింగ్ తో ఈ సినిమా అంచనాలు ఆకాశానికి చేరాయి.ప్రస్తుతం ఈ మూవీ పది భాషల్లో రిలీజవుతుందనే వార్త దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని అమాంతం పెంచేసింది. కొమరం […]

జక్కన్న సినిమా.. ఎన్ని భాషల్లో చూడాలంటే ?
Follow us on

ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా పది.. ఇదేదో జూనియర్ కాలేజ్ ర్యాంకింగ్స్ యాడ్ లా కనిపించినా విషయం వేరు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా పది భాషల్లో ధియేటర్లలో విడుదల కాబోతుందట.

ఇప్పటికే అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్ లాంటి స్టార్ స్టడెడ్ కాస్టింగ్ తో ఈ సినిమా అంచనాలు ఆకాశానికి చేరాయి.ప్రస్తుతం ఈ మూవీ పది భాషల్లో రిలీజవుతుందనే వార్త దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని అమాంతం పెంచేసింది.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి పాత్రల మధ్య నడిచే కల్పిత స్టోరీగా వస్తున్నపీరియాడిక్ డ్రామా ఈ మూవీ. ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్లతో పాటు, హాలీవుడ్ నుంచి అలిసన్ , రే స్టీవెన్సన్ లని కూడా తీసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలిసన్ ఇప్పటికే ఎ వ్యూ టు కిల్ ,ఇండియానా జోన్స్, ది లాస్ట్ క్రూసేడ్ వంటి చిత్రాలలో భాగం కాగా.. రే స్టీవెన్సన్ థోర్ , కింగ్ ఆర్థర్ సినిమాల్లో కనిపించాడు. మొత్తానికి, 2020 లో తెరపైకి రానున్న ఈ మూవీ 10 భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.