Chiranjeevi: సమ్మర్ వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి విదేశాలకు!

| Edited By: Ravi Kiran

Mar 29, 2024 | 1:06 PM

మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన షూటింగ్స్, ఇతర ఈవెంట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేందుకు కచ్చితంగా సమయం కేటాయిస్తుంటాడు. ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్ కు వెళ్లే చిరంజీవి.. ఈసారి సమ్మర్ ట్రిప్ కు రెడీ అయ్యాడు.

Chiranjeevi: సమ్మర్ వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి విదేశాలకు!
Chiranjeevi, Surekha
Follow us on

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఫ్యామిలీకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన షూటింగ్స్, ఇతర ఈవెంట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేందుకు కచ్చితంగా సమయం కేటాయిస్తుంటాడు. ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్ కు వెళ్లే చిరంజీవి.. ఈసారి సమ్మర్ ట్రిప్ కు రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న చిరంజీవి మెగా బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ యూఎస్ఏ కు వెళ్లే చిరు ఈసారి మాత్రం మరో కంట్రీకి వెళ్లాలనుకుంటున్నాడు.

అయితే ఇటీవల ఓ పెళ్లికి హాజరయ్యాడు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ లో యూరోప్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాలను సందర్శించిన ఆయన ఈసారి ఎప్పుడూ చూడని కొన్ని ప్రదేశాలను చూడాలనుకుంటున్నారట. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో “విశ్వభర” యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి నిన్నటి వరకు కష్టపడ్డారు. ఇక హరీష్ శంకర్ తదుపరి చిత్రం కథ గురించి కూడా ఆయన చర్చిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తన కూతురు సుస్మిత కొణిదెల, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే

అయితే భారతదేశంలోని సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో చాలా మంది  నీటి సంరక్షణ చర్యలను సూచిస్తున్నారు. ఇతర నగరాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చిరంజీవి రియాక్ట్ అయ్యారు. బెంగళూరులో ఫాంహౌస్  తాను చేపట్టిన నీటి సంరక్షణ పద్ధతులను షేర్ చేశారు. నీటి ఎద్దడి వల్ల దైనందిన జీవితం దుర్భరంగా మారుతోంది. నేడు బెంగళూరులో నీటి ఎద్దడి ఉండొచ్చు. రేపు ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి నీటిని పొదుపు చేయడానికి సహాయపడే ఇళ్లను నిర్మించాల్సిన అవసరాన్ని చిరంజీవి ప్రత్యేకంగా చెప్పాడు.