బీఫ్ తరలిస్తున్నారనే ఆరోపణలతో…దాడి

| Edited By:

May 26, 2019 | 6:12 PM

ఈ నెల 22న మధ్యప్రదేశ్ లోని సియోని ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళతో సహా ఇద్దరు ముస్లింలపై తమను తాము గోరక్షణ సమితి సభ్యులుగా ప్రకటించుకున్న కొంత మంది యువకులు కర్రలతో దాడి చేశారు. అంతేకాకుండా ‘జై శ్రీరాం’ అనాలంటూ వారిని బలవంతం చేశారు. బీఫ్ తరలిస్తున్నారనే ఆరోపణలతో ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ముస్లింలపై దాడికి పాల్పడిన ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. […]

బీఫ్ తరలిస్తున్నారనే ఆరోపణలతో...దాడి
Follow us on

ఈ నెల 22న మధ్యప్రదేశ్ లోని సియోని ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళతో సహా ఇద్దరు ముస్లింలపై తమను తాము గోరక్షణ సమితి సభ్యులుగా ప్రకటించుకున్న కొంత మంది యువకులు కర్రలతో దాడి చేశారు. అంతేకాకుండా ‘జై శ్రీరాం’ అనాలంటూ వారిని బలవంతం చేశారు. బీఫ్ తరలిస్తున్నారనే ఆరోపణలతో ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ముస్లింలపై దాడికి పాల్పడిన ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా పరారీలో ఉన్న వ్యక్తి గురించి తమ సిబ్బంది వెతుకుతున్నారని పోలీసులు వివరించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఈ ఘటనపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలపై జరిగిన దాడిని ఖండించారు.