Munagala Murder : ఇన్యూరెన్స్ డబ్బు కోసం బాబాయ్ మర్డర్..షాకింగ్ స్కెచ్

| Edited By:

Feb 14, 2020 | 10:22 PM

జులాయిగా తిరిగే ఓ వ్యక్తికి రూ. 50 లక్షల ఇన్సూరెన్స్. నమోదు చేసుకున్న కొద్ది నెలలకే చావు. ఎక్కడో తేడా కొట్టట్లా..?. మృతుడి సోదరుడికి సేమ్ డౌబ్ట్ వచ్చింది. వెంటనే పోలీసులకు అప్రోచ్ అయ్యాడు. విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో నివశించే ముంజల రమేశ్ అనే వ్యక్తికి రెండు లారీలు ఉండేవి. నష్టాలు రావడంతో అతడు ఫైనాన్స్‌ ఇచ్చిన సంస్థలకు సమయానికి వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు […]

Munagala Murder : ఇన్యూరెన్స్ డబ్బు కోసం బాబాయ్ మర్డర్..షాకింగ్ స్కెచ్
Follow us on

జులాయిగా తిరిగే ఓ వ్యక్తికి రూ. 50 లక్షల ఇన్సూరెన్స్. నమోదు చేసుకున్న కొద్ది నెలలకే చావు. ఎక్కడో తేడా కొట్టట్లా..?. మృతుడి సోదరుడికి సేమ్ డౌబ్ట్ వచ్చింది. వెంటనే పోలీసులకు అప్రోచ్ అయ్యాడు. విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయిలో నివశించే ముంజల రమేశ్ అనే వ్యక్తికి రెండు లారీలు ఉండేవి. నష్టాలు రావడంతో అతడు ఫైనాన్స్‌ ఇచ్చిన సంస్థలకు సమయానికి వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు వారు వచ్చి రెండు లారీలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సంపాదన లేక మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి..అతడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అలాంటప్పడు ఐపీ పెట్టి పోలీసులను ఆశ్రయిస్తే..వారే అతడికి రక్షణ కల్పించేవారు. కానీ అతడు ఇక్కడే క్రిమినల్ వేలో ఆలోచించాడు. ఒంటరిగా నివశించే తన బాబాయ్‌ వరసయ్యే సైదులు(30) అనే వ్యక్తికి రూ. 50 లక్షలు ఇన్సురెన్స్ చేయించాడు. అతడిని చంపేసి ఆ వచ్చే డబ్బుతో తన అప్పులు తీర్చుకోవాలని మాస్టర్ ప్లాన్ రచించాడు. చెరో రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పి..అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా క్రైమ్‌లో భాగం చేశాడు. జనవరి 24న సైదులను బొలెరో వెహికల్‌లో తీసుకెళ్లి ఫుల్‌గా మద్యం తాగించాడు. ఆ తర్వాత అదే వాహనంతో ఢీకొట్టి..చనిపోయాడని నిర్దారించుకున్నాక అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అతడు చనిపోయిన 10 రోజులు గడవక ముందే ఇన్సూరెన్స్ పనులు మొదలెట్టాడు ముంజుల రమేశ్. దీంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు వెంకటేవ్వర్లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారి విచారణలో రమేశ్ బాగోతం బయటపడింది.