Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య.. మిస్టరీలో కీలకంగా మారిన సూసైడ్ నోట్‌

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 2:45 PM

అనంతపురంలో (Anantapur) ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటనపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారంలో వచ్చిన నష్టమే అసలు కారణమని కొందరంటుంటే, బిజినెస్ ఫ్రెండ్స్ చేసిన....

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య.. మిస్టరీలో కీలకంగా మారిన సూసైడ్ నోట్‌
Crime
Follow us on

అనంతపురంలో (Anantapur) ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటనపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ వ్యాపారంలో వచ్చిన నష్టమే అసలు కారణమని కొందరంటుంటే, బిజినెస్ ఫ్రెండ్స్ చేసిన మోసమే అతడి ఉసురు తీసిందని మరికొందరు అంటున్నారు. మరోవైపు అనారోగ్య సమస్యలతోనే ఉరేసుకున్నారనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కాగా అతడు రాసిన సూసైడ్ నోట్‌ (Suicide Note) మాత్రం అనంతపురం పోలీసుల్ని అప్రమత్తం చేసేసింది. అనంతపురం పశుసంవర్ధక శాఖ ఉద్యోగి రాము. తాను పని చేస్తున్న డీఆర్‌డీఏ కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం గెస్ట్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపట్లకు చెందిన రాము స్పెషలాఫీసర్‌గా పనిచేస్తూ 3 నెలల కిందట డీఆర్డీఏలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తోటి ఉద్యోగులు చెబుతున్నారు.

రాము చేస్తున్న ఆన్లైన్ బిజినెస్‌లో కొందరితో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. యాభై లక్షలివ్వాలంటూ ఫ్రెండ్సే బ్లాక్‌మెయిల్ చేశారని సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. కానీ ఈ విషయాలేవీ తనకు తెలియవని రాము భార్య చెబుతున్నారు. ఆమె కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్‌లో లెక్చరర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాగానే ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తామని పోలీసులు తెలిపతారు. సూసైడ్ నోట్‌లో రాసిన అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. మొత్తానికి రాము ఆత్మహత్య అంతుబట్టని మిస్టరీగా మారింది.