టబు కోసం కాస్ట్‌లీ సెట్.. బన్నీకి మాత్రం..

Allu Arjun- Trivikram Movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడో చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో టబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆమె కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఖరీదైన బంగ్లా సెట్‌ను వేయనున్నారట. దాదాపు రూ.4కోట్లతో ఈ బంగ్లాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఇంటిని తన ఇష్టప్రకారం విదేశీ హంగులతో తీర్చిదిద్దుతున్నాడట త్రివిక్రమ్.

ఇదిలా ఉంటే మరోవైపు బన్నీకి మాత్రం రూ.1కోటితో సెట్‌ను వేస్తున్నారట. హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తోన్న ఈ సెట్‌ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇందుకు స్టైలిష్ ఫర్నీచర్‌ను తంజావూర్ నుంచి తెప్పిస్తున్నట్లు టాక్. మొత్తానికి మరోసారి భారీతనంతో ప్రేక్షకులను మెప్పించేందుకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *