Breaking: పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గురువారం నుంచి తనకు ఆరోగ్యం సరిగా లేదని,

Breaking: పాక్‌ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 2:58 PM

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గురువారం నుంచి తనకు ఆరోగ్యం సరిగా లేదని, దాంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన షాహిద్ అఫ్రిదీ.. ”గురువారం నుంచి నాకు ఆరోగ్యం సరిగా లేదు. శరీరమంతా ఎక్కువగా నొప్పులు ఉన్నాయి. టెస్ట్‌లో కరోనాగా తేలింది. నేను త్వరగా కోలుకునేందుకు దేవుడిని ప్రార్థించండి” అని అన్నారు. దీంతో మీరు త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

కాగా పాక్‌లో ఇదివరకే క్రికెటర్లు తౌఫీగ్ ఉమర్, జాఫర్ సర్ఫరాజ్‌లు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఆఫ్రిదీతో పాక్‌లో కరోనా బారిన పడిన క్రికెటర్ల సంఖ్య మూడుకు చేరింది. ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అఫ్రిదీ ఎంతోమంది నిరాశ్రయులకు సాయం చేశారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పలువురికి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పాక్‌లోని ఓ హిందూ దేవాలయంలోనూ అఫ్రిదీ నిత్యావరసర సరకులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో మళ్లీ 200 దాటిన కేసులు.. ఏకంగా..!