ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి లేదు…డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా… ఉన్నట్టే ఉంది.. మంత్రి సత్యేంద్ర జైన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 09, 2020 | 1:53 PM

ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి (కమ్యూనల్ ట్రాన్స్ మిషన్) లేదని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఈ నగరం ఇంకా ఈ దశకు చేరుకోలేదని కేంద్ర అధికారులు..

ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి లేదు...డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా... ఉన్నట్టే ఉంది.. మంత్రి  సత్యేంద్ర జైన్
Follow us on

ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి (కమ్యూనల్ ట్రాన్స్ మిషన్) లేదని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఈ నగరం ఇంకా ఈ దశకు చేరుకోలేదని కేంద్ర అధికారులు తెలిపారని ఆయన చెప్పారు. మంగళవారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…. ఢిల్లీలో సామాజిక కరోనా వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారన్నారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర  జైన్ మాత్రం.. ఢిల్లీ ఈ దశకు చేరుకుంటోందని, చాలా కేసులు ఎసింప్టోమాటిక్ కేసులుగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ సోర్స్ (మూలం) ఎక్కడ ఉందో తెలియడంలేదన్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్ ఉందా, లేదా అన్న విషయాన్ని కేంద్రమే ప్రకటించాల్సి ఉందన్నారు. నగరంలో ఈ దశ ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ దీప్ గులేరియా చెబుతుండగా.. కేంద్రం మాత్రం దీన్ని అంగీకరించడం లేదని ఆయన చెప్పారు. మేము మాత్రం ఇలా ప్రకటించలేం అన్నారాయన. కరోనా వైరస్ కేసుల విషయంలో ముంబైతో పోలిస్తే ఢిల్లీ కాస్త ‘వెనుకబడిందని’, మరో పది రోజుల్లో ఈ నగరంలో ఈ కేసులు 50 వేలకు చేరుకోవచ్ఛునని జైన్ పేర్కొన్నారు.