కరోనా ఎఫెక్ట్.. ఐసీసీ కార్యాలయం మూసివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయాన్ని తాకింది.

కరోనా ఎఫెక్ట్.. ఐసీసీ కార్యాలయం మూసివేత
Follow us

|

Updated on: Sep 27, 2020 | 4:34 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయాన్ని తాకింది. ఐసీసీ కార్యాలయ సిబ్బందికి కొందరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆఫీసును కొద్ది రోజుల పాటు మూసివేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా కార్యాలయాన్ని పూర్తిగా శుభ్రం చేసేందుకు కొద్ది రోజుల పాటు కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు సిబ్బంది వర్క్‌ ఫ్రం హోం చేయాలని సూచించారు. అయితే, ఐసీసీ నుంచి అధికార సమాచారం లేకపోయినా బోర్డు సీనియర్‌ సభ్యుడు ఒకరు కొన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నాయని ధ్రువీకరించారు. పీటీఐ అందించిన సమాచారం మేరకు.. ఐసీసీ సిబ్బంది అందరూ పోట్రోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. యూఏఈ ప్రభుత్వం ఆరోగ్య భద్రతా నిబంధనల ప్రకారం ఆఫీసు కార్యకలాపాలు సాగాలంటే, కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని ఐసీసీ సిబ్బంది భావిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతోంది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఉన్న ఐసీసీ అకాడమీ మైదానాన్ని ప్రాక్టీస్ సదుపాయాలను ఐపీఎల్ జట్ల క్రికెట్లరు వినియోగించుకుంటున్నారు. అయితే, ‘ఐసీసీ అకాడమీ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని, ఇది ఆఫీసును హెడ్‌ క్వార్టర్స్‌కు ఆనుకొని లేదని, ప్రాక్టీస్ సెషన్‌కు ఐసీసీ సిబ్బంది ఎవరూ హాజరు కారన్నారు. దీంతో ఐపీఎల్‌ జట్లకు ఎలాంటి సమస్యలేదని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే దుబాయ్ కి వెళ్లిన చెన్నై జట్లు సభ్యులతో పాటు బీసీసీఐ అధికారి, ఢిల్లీకి చెందిన ఫిజియో థెరపిస్ట్ ఒకరు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు.

Latest Articles