‘రామూ ! మీరు చాలా గ్రేట్ !’ వర్మకు బిగ్ బీ అమితాబ్ ప్రశంస.. ఎందుకంటే ?

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 2:29 PM

వివాదాస్పద ట్వీట్లకు పెట్టింది పేరయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.  'కరోనా వైరస్'  టైటిల్ పేరిట లాక్ డౌన్ కాలంలో...

రామూ ! మీరు చాలా గ్రేట్ ! వర్మకు బిగ్ బీ అమితాబ్ ప్రశంస.. ఎందుకంటే ?
Follow us on

వివాదాస్పద ట్వీట్లకు పెట్టింది పేరయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు.  ‘కరోనా వైరస్’  టైటిల్ పేరిట లాక్ డౌన్ కాలంలో పూర్తిగా షూట్ చేసిన మూవీ ట్రైలర్ ను చూసిన బిగ్ బీ అతడ్ని ఆకాశానికెత్తేశారు. ‘మిమ్మల్ని ఎవరూ అణచలేరు రామ్ గోపాల్ వర్మ ! పలువురికి మీరు ‘రామూ’ అయితే నాకు ‘సర్కార్’.(అమితాబ్ తో వర్మ ‘సర్కార్ ‘సినిమా తీసిన సంగతి తెలిసిందే).లాక్ డౌన్ కాలంలో ఒక కుటుంబంపై సినిమా షూట్ చేయడం అపూర్వం.. బహుశా కరోనా వైరస్ పై ఇదే మొదటి సినిమా అనుకుంటా ‘ అని ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని కూడా ఆయన తన ట్వీట్ తో జత చేశారు.

నాలుగు నిముషాల ఈ చిత్రం ట్రైలర్ ని వర్మ మంగళవారం రిలీజ్ చేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజల్లో నెలకొన్న భయాలను ఈ సినిమా ప్రతిబింబించిందని, అంతే తప్ప ఇది హారర్ సినిమా కాదని వర్మ ట్వీట్ చేశాడు. ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ ని పాటిస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ మూవీ షూట్ చేసినట్టు ఆయన పేర్కొన్నాడు.