సీఎం అశోక్ గెహ్లాట్‌తో కలిసిపోయిన సచిన్ పైలట్

కొద్దిరోజులుగా కారాలు మిరియాలు నురుకున్న నేతలిద్దరు ఒక్కటయ్యారు. అధిష్టానం బుజ్జగింపులతో ఇద్దరు నేతలు దిగివచ్చారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఎట్టకేలకు దగ్గరయ్యాడు. గురువారం అశోక్ గెహ్లాట్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిసుకున్నారు

సీఎం అశోక్ గెహ్లాట్‌తో కలిసిపోయిన సచిన్ పైలట్
Follow us

|

Updated on: Aug 13, 2020 | 6:28 PM

కొద్దిరోజులుగా కారాలు మిరియాలు నురుకున్న నేతలిద్దరు ఒక్కటయ్యారు. అధిష్టానం బుజ్జగింపులతో ఇద్దరు నేతలు దిగివచ్చారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఎట్టకేలకు దగ్గరయ్యాడు. గురువారం అశోక్ గెహ్లాట్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిసుకున్నారు. గెహ్లాట్ కూడా సచిన్ పైలట్‌ను సాదరంగా ఆహ్వానించారు. రాజస్థాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శుక్రవారం జరుగనున్నది. ఈ సందర్భంగా అశోక్ గెహ్లాట్‌ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం సాయంత్రం తన నివాసంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలతో సహా సచిన్ ఫైలట్ హాజరయ్యారు.

మరోవైపు, నెల రోజులుగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అసమ్మతి వెల్లగక్కిన సచిన్ ఫైలట్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక దశలో బీజీపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేసినట్లు సమాచారం. అయితే, రాజకీయ సంక్షోభాన్ని సరిదిద్దేపనిని కాంగ్రెస్ అధిష్టానం స్వయంగా తీసుకుంది. సచిన్ పైలట్ ను పిలిపించుకుని రాహుల్, ప్రియాంక గాంధీలు సంప్రదింపులు జరపడంతో కాస్త మెత్తబడ్డారు. ఆయన చెప్పుకున్న సమస్యలపై ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ నాయకత్వం. ఈ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న సచిన్ పైలట్ బుధవారం రాజస్తాన్‌కు చేరుకున్నారు. సీఎల్పీ భేటీ నేపథ్యంలో గురువారం సీఎం గెహ్లాట్ నివాసానికి వెళ్లి ఆయనను కలుకున్నారు. దీనికి ముందు సచిన్ పైలట్ విధేయులైన ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లపై సస్పెన్షన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసింది.