Indexation: కొత్త బడ్జెట్‌తో రియల్ ఎస్టేట్ డీలా.. ఇండెక్సేషన్ తొలగించడం వల్లేనా?

|

Jul 25, 2024 | 5:42 PM

ఇండెక్సేషన్ ప్రయోజనాల తొలగించడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు, ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ఆస్తులను కలిగి ఉన్నవారికి నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలపై పన్ను విధించే మూలధన లాభం పెరుగుతుందని, అలాగే విక్రేతలకు కూడా పన్ను భారం ఎక్కువుతుందని నిపుణులు చెబుతున్నారు.

Indexation: కొత్త బడ్జెట్‌తో రియల్ ఎస్టేట్ డీలా.. ఇండెక్సేషన్ తొలగించడం వల్లేనా?
Real Estate-Budget
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీనిలో కొన్ని కొత్త విధానాలు రూపొందించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఆస్తులపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని పూర్తిగా తొలగించారు. దీని వల్ల ఆస్తిని విక్రయించినప్పడు పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రేటును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.

పన్ను భారం..

ఇండెక్సేషన్ ప్రయోజనాల తొలగించడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు, ప్రత్యేకించి దీర్ఘకాలికంగా ఆస్తులను కలిగి ఉన్నవారికి నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలపై పన్ను విధించే మూలధన లాభం పెరుగుతుందని, అలాగే విక్రేతలకు కూడా పన్ను భారం ఎక్కువుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక పన్ను కారణంగా వారి రాబడి తగ్గుతుందని, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను ఆటంకంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

భారీ మార్పులు..

రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్ను కోసం ఆర్థిక మంత్రి తీసుకున్న నిర్ణయం ఆ రంగంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించడం వల్ల పన్ను భారం పెరుగుతుంది. అయితే పన్ను విధానాన్ని సరళీకృతం, హేతుబద్ధం చేయాలన్నదే దీని వెనుక ఉద్దేశమని మంత్రి చెబుతున్నారు. అలాగే ఎల్‌టీసీజీ పన్ను రేటును 12.50 శాాతానికి తగ్గించారు. ఏది ఏమైనప్పటికీ ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించడం వల్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలపై అధిక పన్ను భారం పడవచ్చు.

రియల్ ఎస్టేట్ కు దెబ్బ..

ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం రియల్ ఎస్టేట్ ఆకర్షణను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తీసివేయడం అనేది రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను దెబ్బతీస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే పన్ను నిర్మాణాలను సరళీకృతం చేయడానికి స్వాగతించదగిన చర్య అని అభిప్రాయ పడుతున్నారు. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.50 శాతానికి తగ్గించడంపై పలువురు అభినందిస్తున్నారు. ఇండెక్సేషన్ ప్రయోజనాలను తీసివేసేందుకు ఈ తగ్గింపును తీసుకువచ్చినప్పటికీ ఆస్తి లావాదేవీలలో మరింత లిక్విడిటీని ప్రోత్సహిస్తుందన్నారు.

2001 వరకూ..

పరిశ్రమ వాటాదారులు, ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తమ ఆందోళనలను లేవనెత్తిన తర్వాత, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ మాట్లాడుతూ 2001 వరకు ఇండెక్సేషన్ ప్రయోజనం కొనసాగుతుందని ప్రకటించారు.

ఇండెక్సేషన్ అంటే..

ద్రవ్యోల్బణం వల్ల డబ్బుకు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడం వల్ల పన్ను విధించే మూలధన లాభం తగ్గుతుంది. దీనివల్ల పన్ను చెల్లింపులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తీసివేయడం వల్ల ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేయకుండా అసలు కొనుగోలు ధర ఆధారంగా పన్నులు లెక్కిస్తారు. కొత్త విధానంలో ఎల్టీసీజీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ మూలధన లాభంపై పన్ను అధికంగా పడుతుంది. రియల్ ఎస్టేట్ ఆస్తుల విక్రేతలకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల పాత ఆస్తులను విక్రయించేవారు అధికంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..