Credit Score: క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ పెరగాలంటే ఇది చేయాల్సిందే..

|

Jul 25, 2024 | 5:58 PM

అన్ని రుణాలు సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నా.. పాత రుణాలను సమయానికే క్లియర్ చేసేసినా.. క్రెడిట్ కార్డులు డెడ్ లైన్ కన్నా ముందే చెల్లిస్తున్నా.. ఎందుకు క్రెడిట్ స్కోర్ తగ్గిందో అర్థం కాదు. ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు క్రెడిట్/సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది అని రిజక్ట్ చేసినప్పుడు షాక్ అవడం మన వంతు అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మన క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిందో ఎలా తెలుసుకోవాలి?

Credit Score: క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే ఏమవుతుంది? సిబిల్ స్కోర్ పెరగాలంటే ఇది చేయాల్సిందే..
Credit Score
Follow us on

ఇటీవల కాలంలో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోవడం. అన్ని రుణాలు సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నా.. పాత రుణాలను సమయానికే క్లియర్ చేసేసినా.. క్రెడిట్ కార్డులు డెడ్ లైన్ కన్నా ముందే చెల్లిస్తున్నా.. ఎందుకు క్రెడిట్ స్కోర్ తగ్గిందో అర్థం కాదు. ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు క్రెడిట్/సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది అని రిజక్ట్ చేసినప్పుడు షాక్ అవడం మన వంతు అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మన క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిందో ఎలా తెలుసుకోవాలి? మళ్లీ క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు ఏం చేయాలి? తెలియాలంటే ఇది చదవాల్సిందే..

క్రెడిట్ స్కోర్ ఉంటేనే..

రుణం కావాలనుకునే ప్రతి వ్యక్తికీ క్రెడిట్ స్కోర్ అవసరం. అది లేకుండా మీకు ఎలాంటి రుణాలు మంజూరు కావు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. 750కి పైగా ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా గుర్తిస్తారు. ‌అలాంటి వారికి సులభంగా లోన్లు మంజూరవడంతో పాటు తక్కువ వడ్డీకే లభిస్తాయి. కానీ మీకు తెలియకుండా స్కోర్ తగ్గిందంటే మాత్రం మీరు మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసుకోవాల్సిందే..

క్రెడిట్ రిపోర్టు అంటే..

క్రెడిట్ స్కోర్ ను సాధారణంగా క్రెడిట్ బ్యూరో ఏజెన్సీలు రూపొందిస్తాయి. బ్యాంకర్లు అంటే రుణదాతలు అందించిన సమాచారాన్ని బట్టి క్రెడిట్ బ్యూరో సంస్థ మీ ప్రోఫైల్ కి స్కోర్ ఇస్తుంది. అంతే రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? లేదా? ఈఎంఐ పెండింగ్ ఉంటున్నాయా? క్రెడిట్ కార్డుల బిల్లులు సమయానికి చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాలు రుణదాతలు క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. ఆ నివేదికలో ఏమైనా లోపాలుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. కొన్ని సార్లు రుణదాతలు ఇచ్చే తప్పు సమాచారం వల్ల కూడా క్రెడిట్ బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తాయి.
అందుకే క్రెడిట్ బ్యూరోలు ఇచ్చే నివేదికలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి.

తప్పులుంటే ఏం చేయాలి?

క్రెడిట్ బ్యూరోలు అందించే నివేదికలో తప్పులుంటే వాటిని సరిచేసుకోడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మీ చెల్లింపుల్లో ఆలస్యం లేకపోయినా.. ఆలస్యమైనట్లు నివేదికలో గుర్తిస్తే.. వెంటనే రుణదాత దృష్టికి తీసుకెళ్లాలి. నివేదికను సరిచేయాలని కోరాలి. అలాగే మీ పేరు, చిరునామా, తదితర అంశాల్లో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేవని నిర్ధారించుకోండి. ఒకవేళ ఏమైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసుకోవాలి. మీరు ఒకవేళ రుణాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకునకు బదిలీ చేసుకుంటే రెండు బ్యాంకుల్లో అప్పు ఉన్నట్లు నివేదికలో వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కూడా సరిచేసుకోవాలి. క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితి ని బ్యాంకు పెంచుతుంది. కానీ ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు చెప్పదు. దీనివల్ల కూడా అధిక క్రెడిట్ వినియోగ రేషియో ఏర్పడి, స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

మీ క్రెడిట్ నివేదికను కనీసం మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి అయినా తనిఖీ చేసుకొని.. వాటిలో ఏ చిన్న తప్పు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి సరిచూసుకోవడం చాలా అవసరం. అప్పుడే మంచి క్రెడిట్ స్కోర్ మీకు కొనసాగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..