Personal Loan: ఈఎంఐలు కట్టడం లేదా? బ్యాంకులు ఏం చేస్తాయో తెలిస్తే షాక్ అవుతారు..

|

Jul 25, 2024 | 5:17 PM

ప్రతి నెల సులభ వాయిదాలలో(ఈఎంఐ)లు చెల్లిస్తూ.. ఇబ్బంది లేకుండా దానిని ముగించే వీలుండటంతో అందరూ వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల్లో ఆ ఈఎంఐలు మీరు చెల్లించకలేక పోవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో బ్యాంకర్లు ఏం చేస్తాయో తెలుసా? ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క రుణగ్రహీతలు తెలుసుకోవాలి.

Personal Loan: ఈఎంఐలు కట్టడం లేదా? బ్యాంకులు ఏం చేస్తాయో తెలిస్తే షాక్ అవుతారు..
Personal Loan
Follow us on

ఇటీవల కాలంలో పర్సనల్ లోన్లు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బయట వ్యక్తుల వద్ద భారీ వడ్డీ రేట్లకు లోన్లు తీసుకునే కన్నా.. మూడో వ్యక్తి తెలియకుండా బ్యాంకులు, ఇతర ఫైనాన్సింగ్ సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు(పర్సనల్ లోన్లు) తీసుకునే వారు అధికమవుతున్నారు. ప్రతి నెల సులభ వాయిదాలలో(ఈఎంఐ)లు చెల్లిస్తూ.. ఇబ్బంది లేకుండా దానిని ముగించే వీలుండటంతో అందరూ వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల్లో ఆ ఈఎంఐలు మీరు చెల్లించకలేక పోవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో బ్యాంకర్లు ఏం చేస్తాయో తెలుసా? ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క రుణగ్రహీతలు తెలుసుకోవాలి. లోన్ తీసుకునే ముందే తప్పనిసరిగా ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరం.

పర్సనల్ లోన్ డిఫాల్ట్..

వ్యక్తిగత రుణం తీసుకున్న వ్యక్తి అనివార్య కారణాల వల్ల ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన ఈఎంఐలు చెల్లించకపోతే దానిని బ్యాంకింగ్ పరిభాషలో డిఫాల్ట్ అని అంటారు. సాధారణంగా గోల్డ్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటిల్లో డిఫాల్ట్ అయితే బ్యాంకర్లకు తనఖాగా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సులభంగా వాటిని జప్తు చేసుకొని వాటి రుణాన్ని క్లియర్ చేసుకుంటారు. మరి పర్సనల్ లోన్లలో తనఖాగా ఏమి ఉండదు. జప్తునకు అవకాశం ఉండదు. పర్సనల్ కేవలం వ్యక్తుల క్రెడిట్ స్కోర్ ఆధారంగానే మంజూరు చేస్తూ ఉంటారు. మరీ అలాంటి లోన్లలో డిఫాల్టు అయితే బ్యాంకర్లు ఏం చేస్తాయి? అందుకు న్యాయపరమైన ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

బ్యాంకర్లు ఏం చేస్తారంటే..

  • వ్యక్తులు తీసుకున్న పర్సనల్ లోన్లు తిరిగి చెల్లించడంలో విఫలం అయితే బ్యాంక్లు ఆ వ్యక్తిని డిఫాల్ట్ గుర్తిస్తాయి.
    వరుసగా మూడు నెలలు(90 రోజులు) పాటు ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకర్లు ఆ ఖాతాను నిరర్థక ఆస్తి(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్-ఎన్పీఏ) పరిగణిస్తాయి.
  • వెంటనే రుణ గ్రహీతకు ఓ నోటీసు పంపుతాయి. నోటీసు అందుకున్న మరో 60 రోజుల పాటు రుణ గ్రహీత స్పందన కోసం బ్యాంకర్లు ఎదురుచూస్తారు.
  • ఈ లోపు బ్యాంక్ అధికారులను సంప్రదించి, రుణాన్ని తిరిగి చెల్లిస్తానని చెప్పడం ద్వారా ఇతర చర్యలు తీసుకోకుండా ఆపవచ్చు.
  • ఒకవేళ నోటీసు తీసుకున్న తర్వాత కూడా రుణ గ్రహీత స్పందిచకపోతే అతని పేరున ఉన్న ఎఫ్డీలు/సేవింగ్స్ ఖాతా నుంచి రికవరీ చేసుకునేందుకు బ్యాంకర్లకు అవకాశం ఉంటుంది.
  • అప్పటికీ రుణం క్లియర్ కాకపోతే బ్యాంకు అధికారులు చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించవచ్చు. సివిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తారు. అప్పుడు కోర్టులు రుణాన్ని తిరిగి చెల్లించమని ఆదేశిస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే రుణ గ్రహీత ఆస్తులను స్వాధీనం చేసుకోమని కోర్టులు ఆదేశించవచ్చు.

డిఫాల్ట్ అయితే నష్టాలు ఇవి..

ఎవరైనా రుణాన్ని తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలం అయితే డిపాల్ట్ అవుతారు. అలా ఒక్కసారి డిఫాల్ట్ లిస్ట్ లో చేరితే భవిష్యత్తులో మీకు ఎలాంటి రుణాలు మంజూరు కావు. క్రెడిట్ స్కోర్ బాగా దెబ్బతింటుంది. ప్రతి ఈఎంఐ డిఫాల్ట్ కి 50 నుంచి 70 పాయింట్లు స్కోర్ తగ్గిపోతుంది. అదనపు జరిమానాలు, ఆలస్య రుసుములు విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..