Budget 2024: పెట్టుబడి దారులకు అలర్ట్.. కొత్త బడ్జె‌ట్‌తో పన్ను విధానంలో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..

|

Jul 29, 2024 | 4:47 PM

పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తన ఆర్థిక పద్దులో మినహాయింపులు, సబ్సిడీలు, తగ్గింపులు అమలు చేయడంతో పాటు కొన్నింటికి కొత్త పన్ను విధానాలను రూపొందించారు. ముఖ్యంగా మూలధన లాభాలపై పన్ను విధించే విధానంలో మార్పులు తీసుకువచ్చారు.

Budget 2024: పెట్టుబడి దారులకు అలర్ట్.. కొత్త బడ్జె‌ట్‌తో పన్ను విధానంలో మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు..
Income Tax Slab
Follow us on

పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మంత్రి నిర్మలా సీతారామన్ తన ఆర్థిక పద్దులో మినహాయింపులు, సబ్సిడీలు, తగ్గింపులు అమలు చేయడంతో పాటు కొన్నింటికి కొత్త పన్ను విధానాలను రూపొందించారు. ముఖ్యంగా మూలధన లాభాలపై పన్ను విధించే విధానంలో మార్పులు తీసుకువచ్చారు. ఈ కొత్త నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ లు), ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ వోఎఫ్ లు), అంతర్జాతీయ పథకాలు వంటికి దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్ టీసీజీ) పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి.

ప్రధాన మార్పులు ఇవే..

కొత్త బడ్జెట్ లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం హోల్డింగ్ పిరియడ్ తగ్గించడం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి కాలవ్యవధిని 36 నెలల నుంచి 24 నెలలకు తగ్గించారు. అలాగే బంగారంపై ఎల్ టీసీజీ లెక్కింపు కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్నితొలగించారు. మ్యూచువల్ ఫండ్ (ఎమ్ఎఫ్) ఆఫర్లు, ఈక్విటీ లేదా డెట్ ఆధారితమైనవి కాకుండా, 24 నెలలకు పైగా ఉంచనవి ఇప్పుడు 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు అర్హత పొందుతాయి. ప్రస్తుతం బంగారం, వెండి ఈటీఎఫ్ లు, ఇండెక్స్ ఫండ్‌లు, ఈక్విటీ ఓరియెంటెడ్, హైబ్రిడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌ఓఎఫ్‌లు), అంతర్జాతీయ పథకాలపై పెట్టుబడిదారుల ఆదాయపు పన్ను స్లాబ్ రేటుపై పన్ను విధిస్తున్నారు. వివిధ రకాల ఆస్తులకు మూలధన లాభాల పన్ను విధానంలో మార్పులు తీసుకువచ్చారు. స్వల్పకాలిక మూలధన లాభాలు (ఎస్టీసీజీ), దీర్ఘకాలిక మూలధన లాభాలు (ఎల్టీసీజీ) కోసం హోల్డింగ్ పీరియడ్ లను మార్చారు. దీనివల్ల ఈక్విటీ, డెట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీలో పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.

కొత్త నియమాల అమలు..

మ్యూచువల్ ఫండ్ లలో ఈక్విటీకి 35 నుంచి 65 శాతం కేటాయించే పెట్టుబడిదారులు, డెట్, ఈక్విటీ లేదా రెండింటి కలయికతో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పాటు వీటిని కొనసాగించేవారు ఇండెక్సేషన్ ప్రయోజనాలను పొందలేరు. అలాగే బంగారం మూలధన లాభాలపై తీసుకు వచ్చిన కొత్త నియమాలు 2024 జూలై 23 నుంచి వర్తిస్తాయి.

  • గతంలో ఉన్న నిబంధలన ప్రకారం బంగారం, బంగారు ఆభరణాల అమ్మకంపై దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించేటప్పుడు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ ధర సద్దుబాటు)ను అనుమతించేవారు.
  • ద్రవ్యోల్బణంలో మార్పులను ట్రాక్ చేసే ఇండెక్స్ ప్రకారం సముపార్జన ధరను పెంచడం ద్వారా పన్ను విధించే మూలధన లాభాలను తగ్గించడానికి సూచిక ఉపయోగపడుతుంది.
  • బంగారాన్ని 36 నెలల పాటు కలిగి ఉంటే దాని అమ్మకంపై మూలధన లాభాలను దీర్ఘకాలికంగా పరిగణించేవారు. 20 శాతం పన్ను విధించేవారు.
  • దేశీయ ఈక్విటీలలోని కార్పస్‌లో 35 శాతం కంటే తక్కువ పెట్టుబడి పెట్టే ఏదైనా ఎమ్ఎఫ్ పథకానికి ఇకపై ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉండవని ప్రభుత్వం తెలిపింది. అటువంటి పథకాలపై బ్యాంకు డిపాజిట్లతో సమానంగా పన్నును తీసుకువచ్చారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..