FD Interest Rates: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. బెస్ట్ ఏది అంటే..

|

Sep 10, 2024 | 6:22 PM

వివిధ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో ఎఫ్ డీలను అమలు చేస్తున్నాయి. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. కాబట్టి ఎఫ్‌డీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రముఖ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో రూ.3 కోట్ల కంటే తక్కువ ఎఫ్ డీలపై వడ్డీరేట్ల ఇలా ఉన్నాయి.

FD Interest Rates: ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. బెస్ట్ ఏది అంటే..
Fd Scheme
Follow us on

డబ్బులను దాచుకోవడానికి బ్యాంకులు అత్యంత సురక్షితమైనవిగా ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా పొదుపు చేయడానికి వాటినే ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు (ఎఫ్ డీలు) అత్యంత ఆదరణ పొందుతున్నాయి. నిర్ణీత సమయానికి అసలుతో పాటు వడ్డీని కలిపి తీసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది ఎఫ్ డీలకే ప్రాధాన్యం ఇస్తారు. వివిధ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో ఎఫ్ డీలను అమలు చేస్తున్నాయి. సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి. కాబట్టి ఎఫ్‌డీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ప్రముఖ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో రూ.3 కోట్ల కంటే తక్కువ ఎఫ్ డీలపై వడ్డీరేట్ల ఇలా ఉన్నాయి.

హెచ్డీఎఫ్సీ బ్యాంకు..

  • 7 రోజుల నుంచి 14 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తారు.
  • 15 నుంచి 29 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50.
  • 30 నుంచి 45 రోజులకు 3.50 (సాధారణ), 4 శాతం (సీనియర్ సిటిజన్లు).
  • 46 నుంచి 60 రోజులకు 4.50 (సాధారణ), 5 శాతం (సినియర్ సిటిజన్లు).
  • 90 రోజుల నుంచి 6 నెలలకు 4.50 (సాధారణ), 5 శాతం (సీనియర్ సిటిజన్)
  • ఏడాది నుంచి 15 నెలల లోపు 6.60 (సాధారణ), 7.10 (సీనియర్ సిటిజన్)
  • 21 నెలల నుంచి రెండేళ్ల లోపు 7 శాతం (సాధారణ), 7.50 (సీనియర్ సిటిజన్)
  • నాలుగేళ్ల ఏడు నెలల నుంచి ఐాదేళ్ల వరకూ 7 శాతం (సాధారణ), 7.50 (సీనియర్ సిటిజన్)
    *ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల వరకూ 7 శాతం (సాధారణ), 7.50 (సీనియర్ సిటిజన్)

యాక్సిస్ బ్యాంక్..

  • 7 రోజుల నుంచి 14 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తారు.
  • 30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ ఇస్తారు.
  • ఏడాది నుంచి 13 నెలల లోపు 6.70 శాతం (సాధారణ), 7.20 (సీనియర్ సిటిజన్)
  • రెండేళ్ల నుంచి 30 నెలల లోపు 7.10 శాతం (సాధారణ), 7.60 (సీనియర్ సిటిజన్)
  • 30 నెలల నుంచి మూడేళ్ల లోపు 7.10 శాతం (సాధారణ), 7.60 (సీనియర్ సిటిజన్)
  • మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు 7.10 శాతం (సాధారణ), 7.60 (సీనియర్ సిటిజన్)
  • ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7. శాతం (సాధారణ), 7.75 (సీనియర్ సిటిజన్)

ఐసీఐసీఐ బ్యాంకు..

  • ‌7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఇస్తారు.
  • 30 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్ పై సాధారణ ఖాతాదారులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ ఇస్తారు.
  • ఏడాది నుంచి 15 నెలల లోపు 6.70 శాతం (సాధారణ), 7.20 (సీనియర్ సిటిజన్)
  • 18 నెలల నుంచి రెండేళ్ల లోపు 7.25 శాతం (సాధారణ), 7.75 (సీనియర్ సిటిజన్)
  • రెండేళ్ల ఒక్క రోజు నుంచి ఐదేళ్ల లోపు 7 శాతం (సాధారణ), 7.50 (సీనియర్ సిటిజన్)
  • ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల లోపు 6.90 శాతం (సాధారణ), 7.40 (సీనియర్ సిటిజన్)
  • ఐదేళ్ల టాక్స్ సేవర్ ఎఫ్ డీకి సంబంధించి 7 శాతం (సాధారణ), 7.75 (సీనియర్ సిటిజన్)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..