Stock Market: భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదలతో ఆందోళనలో పెట్టుబడిదారులు..

|

Jun 17, 2022 | 9:47 AM

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంక్‌ ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం పడుతోంది...

Stock Market: భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదలతో ఆందోళనలో పెట్టుబడిదారులు..
Stock Market
Follow us on

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంక్‌ ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం పడుతోంది. గురువారం సెన్సెక్స్‌ 1045 పాయింట్ల పడిపోగా.. నిఫ్టీ 331 పాయింట్లు పడిపోయంది. శుక్రవారం ఉదయం 10.40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 258 పాయింట్లు తగ్గి 51,282 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 62 పాయింట్ల కోల్పోయి 15,297 వద్ద ట్రేడవుతోంది.
టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, ఇండసండ్‌ బ్యాంక్, విప్రో, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ నష్టాల్లో ఉండగా.. నెస్లే ఇండియా ఒక్కటి మాత్రమే లాభాల్లో ట్రేడవుతుంది.