Sukanya Samriddhi Yojana: ఈ పథకంలో 8.2శాతం వడ్డీ రేటు.. ఆడపిల్లల తల్లిదండ్రలు వదులుకోవద్దు..

|

Jul 01, 2024 | 5:47 PM

బాలికా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌ సుకన్య సమృద్ధి యోజన. వారి భవిష్యత్తు అవసరాలకు తల్లిదండ్రులకు ఓ ప్రణాళికనిస్తూ.. ఉన్నత చదువులు, పెళ్లి సమయానికి తగిన ఆర్థిక భరోసాను అందించేడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రభుత్వం అందించే అన్ని పథకాలలోకెల్లా అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఇదే. దీనిలో ఏకంగా 8.2శాతం వడ్డీ లభిస్తోంది.

Sukanya Samriddhi Yojana: ఈ పథకంలో 8.2శాతం వడ్డీ రేటు.. ఆడపిల్లల తల్లిదండ్రలు వదులుకోవద్దు..
Sukanya Samriddhi Yojana
Follow us on

బాలికా సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్కీమ్‌ సుకన్య సమృద్ధి యోజన. వారి భవిష్యత్తు అవసరాలకు తల్లిదండ్రులకు ఓ ప్రణాళికనిస్తూ.. ఉన్నత చదువులు, పెళ్లి సమయానికి తగిన ఆర్థిక భరోసాను అందించేడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రభుత్వం అందించే అన్ని పథకాలలోకెల్లా అత్యధిక వడ్డీ వచ్చే పథకం ఇదే. దీనిలో ఏకంగా 8.2శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి త్రైమాసికానికి ఈ వడ్డీ రేటు మారుతుంటుంది. 2024 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఈ వడ్డీ రేటు అమలవుతోంది. ఇది దీర్ఘకాలపు పథకం. దీని పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను రహిత మెచ్యూరిటీ, మినహాయింపును కూడా పొందొచ్చు. ఈ ఖాతాను ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌లో ఓపెన్‌ చేయొచ్చు.

సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి అర్హత.. సుకన్య సమృద్ధి యోజన ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే తెరిచే వీలుంది. ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు ఖాతాలు అంటే ఇద్దరు ఆడపిల్లల పేరుతో ప్రారంభించాలి., రెండవ సారి జన్మించిన కవలలకు మినహాయింపు ఉంటుంది. వారు మూడో ఖాతా కోసం ప్రారంభించే వీలుంది.

అవసరమైన పత్రాలు.. ఎస్‌ఎస్‌వై ఖాతాను తెరవడానికి అప్లికేషన్‌ ఫారం, లబ్ధిదారుడి (కుమార్తె) జనన ధ్రువీకరణ పత్రం, సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల చిరునామా రుజువు, సంరక్షకుడు లేదా తల్లిదండ్రుల ఐడీ రుజువు, ఫొటోగ్రాఫ్‌ కావాలి.

ఫారమ్ సమర్పణ.. సుకన్య సమృద్ధి యోజన ఖాతా ప్రారంభ ఫారమ్‌ను పూరించిన తర్వాత, అవసరమైన పత్రాలు, ఫోటోగ్రాఫ్‌లతో పాటు, రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉండే ప్రాథమిక కంట్రిబ్యూషన్‌ మొత్తంతో సమర్పించవచ్చు.

డిపాజిట్ పదవీకాలం.. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏటా కనీసం రూ. 250, గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్‌ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు లేదా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసే సమయం.

గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు.. ఖాతా తెరవడం పూర్తయిన తర్వాత, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగించి డిపాజిట్లు చేయవచ్చు. వార్షిక డిపాజిట్లు చేయడంలో వైఫల్యం చెందితే ఖాతా డిఫాల్ట్ కింద వర్గీకరిస్తారు. ప్రతి డిఫాల్ట్‌కి రూ. 50 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రలు తప్పనిసరిగా ఈ పథకాన్ని ప్రారంభించి, ప్రతి నెలా కంట్రిబ్యూషన్ చెల్లించాలని సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..