Maruti Suzuki: ఆ కారుపై ఏకంగా రూ. 3.3లక్షల తగ్గింపు.. బంపరాఫర్ మిస్ కాకండి..

|

Jul 25, 2024 | 4:56 PM

మారుతీ సుజుకి కంపెనీ తన జిమ్నీ కారుపై అతి పెద్ద డిస్కౌంట్ ను ప్రకటించింది. కారును మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంది. దీనిపై దాదాపు 3.3 లక్షల తగ్గింపును అందజేస్తోంది. ఈ కారు విడుదలైన తర్వాత ఇదే అత్యంత తగ్గింపు ధర అని చెప్పవచ్చు.

Maruti Suzuki: ఆ కారుపై ఏకంగా రూ. 3.3లక్షల తగ్గింపు.. బంపరాఫర్ మిస్ కాకండి..
Maruti Suzuki Jimny
Follow us on

కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి శుభవార్త చెప్పింది. తమ కంపెనీకి చెందిన పలు కార్లపై జూలైలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. దాదాపు రూ.3.3 లక్షల భారీ తగ్గింపును అందజేస్తుంది. తద్వారా ఈ కార్లను కొనుగోలు చేయడానికి మంచి అవకాశం కల్పించింది. మారుతీ సుజుకీ కార్లను ఇష్టపడే వారు వివిధ మోడళ్లపై అత్యంత తగ్గింపు ధరలు పొందవచ్చు. ఫ్రాంక్స్ కారుపై రూ.85 వేలు, మారుతీ జిమ్మీపై రూ. 3.3 లక్షల డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

జిమ్నీపై భారీ తగ్గింపు..

మారుతీ సుజుకి కంపెనీ తన జిమ్నీ కారుపై అతి పెద్ద డిస్కౌంట్ ను ప్రకటించింది. కారును మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంది. దీనిపై దాదాపు 3.3 లక్షల తగ్గింపును అందజేస్తోంది. ఈ కారు విడుదలైన తర్వాత ఇదే అత్యంత తగ్గింపు ధర అని చెప్పవచ్చు.

రూ.3.30 లక్షల డిస్కౌంట్..

మారుతీ సుజుకి జిమ్నీ కారు అడ్వంచర్ చేసే వారికి, అలాగే నగర వాసులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆకట్టుకునే డిజైన్, మంచి పిక్ అప్ సామర్థ్యం దీనికి ప్రత్యేకతలు. గతంలో జిమ్నీ కారుపై రూ.2.50 లక్షల వరకూ తగ్గింపు ఉండేది. దానికి జూలైలో మరో రూ.80 వేలు పెంచారు. దీంతో మొత్తం 3.30 లక్షల డిస్కౌంట్ అందజేస్తున్నారు. ఈ తగ్గింపు రేంజ్- టాపింగ్ జిమ్నీ ఆల్పా వేరియంట్ కు ఇస్తున్నారు. ఈ కారు కొనుగోలు చేసిన వారికి రూ.1.80 లక్షల వరకూ నగదు తగ్గింపు ఉంటుంది. అలాగే సుజుకీ ద్వారా ఫైన్సాన్స్ తీసుకునే వారికి మరో రూ.1.50 లక్షలను అదనంగా తగ్గిస్తారు. దీంతో మొత్తం 3.30 లక్షల తగ్గింపు ధరకు జిమ్నీని సొంతం చేసుకోవచ్చు. అయితే మీ ప్రాంతం, డీలర్ షిప్ నిబంధనలకు అనుగుణంగా ఈ తగ్గింపులు మారుతూ ఉంటాయి. అలాగే జీటా వేరియంట్‌ కూడా నమ్మలేని తగ్గింపు ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీనిపై దాదాపు రూ. 2.75 లక్షల వరకూ తగ్గింపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

జిమ్నీ ప్రత్యేకతలు..

మారుతీ జిమ్నీ ప్రత్యేకతల్లోకి వెళితే ఈ కారు 105 హెచ్ పీ, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందించే 1.5 లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో శక్తిని పొందుతుంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో అందుబాటులో ఉంది. దీనిలోని ఆల్ఫా ఏటీ వేరియంట్ రూ. 14.79 లక్షలు, ఆల్ఫా ఎంటీ రూ.13.69 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి.

ఫ్రాంక్స్ కారుపై రూ.85 వేలు..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కారుపై కూడా కంపెనీ తగ్గింపు ధరను ప్రకటించింది. టర్బో ఇంజిన్ తో వస్తున్న ఈ కారుపై దాదాపు రూ.85 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. గతంలో ఈ తగ్గింపు రూ.75 వేలుగా ఉండేది. దానికి పదో వేలకు కంపెనీ అదనంగా కలిపింది. ఈ కారును కొనుగోలు చేసినప్పుడు రూ.32,500లను తగ్గిస్తారు. అలాగే ఖాతాదారులు తమ పాత వాహనాన్ని వెనక్కి ఇచ్చినప్పుడు మరో రూ.పదివేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.43 వేలు విలువ చేసే వెలాసిటీ ఎడిషన్ కిట్ అందజేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..