Jio-MediaTek: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ.. మీడియాటెక్‌తో కలిసి సరికొత్త ఆవిష్కరణ..

|

Jul 27, 2024 | 4:28 PM

రిలయన్స్ గ్రూప్ లోని రిలయన్స్ ప్లాట్ ఫామ్స్ అనుబంధ సంస్థ జియో థింగ్స్, మీడియా టెక్ సంయుక్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్ ఫాంను ఆవిష్కరించాయి. దీనికి సంబంధించిన వివరాలను జియోథింగ్స్, మీడియాటెక్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపాయి. ఇది టూ వీలర్ల కోసం డిజైన్ చేసిన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్.

Jio-MediaTek: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ.. మీడియాటెక్‌తో కలిసి సరికొత్త ఆవిష్కరణ..
Jio Collaborates With Mediatek
Follow us on

దిగ్గజ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సెమీ కండెక్టర్ల తయారీ కంపెనీ మీడియా టెక్ తో కలిసి ముందుకుసాగుతోంది. రిలయన్స్ గ్రూప్ లోని రిలయన్స్ ప్లాట్ ఫామ్స్ అనుబంధ సంస్థ జియో థింగ్స్, మీడియా టెక్ సంయుక్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్ ఫాంను ఆవిష్కరించాయి. దీనికి సంబంధించిన వివరాలను జియోథింగ్స్, మీడియాటెక్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపాయి. ఇది టూ వీలర్ల కోసం డిజైన్ చేసిన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్. దీని సాయంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ ల్యాండ్ స్కేప్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు ఆ కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి. ఇది ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టం. దీని సాయంతో రియల్ టైం డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్, జియో వాయిస్ అసిస్టెంట్, జియో సావన్ వంటి యాప్ ఆధారిత సర్వీసులను వినియోగించుకునేందుకు యాక్సెస్ లభిస్తుంది.

జియో ఆటోమోటిక్ యాప్ సూట్..

జియో థింగ్స్, మీడియాటెక్ సెమీ కండక్టర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ డిజిటల్ క్లస్టర్ వాహనదారులకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. వాహనంలోని కంట్రోలర్లతో ఈ డిజిటల్ కన్సోల్ నిరంతరాయ అనుసంధానాన్ని అందిస్తుంది. ఐఓటీ ఎనేబుల్డ్ చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఇది అందిస్తుంది. అంతేకాక ఈ డిజిటల్ కన్సోల్ లో ఆటోమోటివ్ యాప్ సూట్ కూడా ఉంటుంది. ఈ సూట్ లో జియో వాయిస్ అసిస్టెంట్, జియో సావన్, జియో పేజెస్, జియో ఎక్స్ ప్లోరర్ వంటివి రైడర్లకు వినూత్న రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

స్మార్ట్ డ్యాష్ బోర్డులు..

ఈ సందర్భంగా మీడియా టెక్ కంపెనీ ఇంటెలిజెంట్ డివైజెస్ బిజినెస్ గ్రూప్ కార్పొరేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జెర్రీ యు మాట్లాడుతూ జియోథింగ్స్ తో మీడియా టెక్ కలిసి పనిచేయడం వల్ల ఐఓటీ, ఆటోమోటివ్ రెండింటిలోనూ వినూత్నమైన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడిందన్నారు. తమన విజన్ లో టూ వీలర్ స్మార్ట్ డ్యాష్ బోర్డులు ఉన్నాయని అన్నారు. మీడియా టక్ కంపెనీ ఐఓటీ బిజినెస్ యూనిట్ జనర్ మేనేజర్ సీకే వాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ టూ వీలర్ మార్కెట్లో నిత్యం మారుతున్న అవసరాలకు అనుగుణంగా మీడియా టెక్, జియో థింగ్స్ కలయిక పనిచేస్తుందన్నారు. తర్వాతి జనరేషన్ స్మార్ట్ క్లస్టర్లను అందించేందుకు కృషి చేస్తామన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..