Fixed Deposit: ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..

|

Jul 20, 2024 | 5:47 PM

మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024, జూలై 16 నుంచి అమలులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఎఫ్డీలు, అలాగే రెన్యూవల్ చేసుకునే ఎఫ్డీలు రెండింటికీ ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.

Fixed Deposit: ఐసీఐసీఐ బ్యాంకులో పెరిగిన ఎఫ్‌డీ రేట్లు.. కొత్త రేట్లు ఇవే..
Icici Bank
Follow us on

ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అన్ని బ్యాంకులు సవరిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2024, జూలై 16 నుంచి అమలులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఎఫ్డీలు, అలాగే రెన్యూవల్ చేసుకునే ఎఫ్డీలు రెండింటికీ ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. సవరించిన రేట్ల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సంవత్సరానికి కనీసం 3.00% నుంచి గరిష్టంగా 7.20% వరకు వడ్డీని ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాం..

ఐసీఐసీఐ బ్యాంక్ తాజా ఎఫ్డీ రేట్లు..

బ్యాంక్ ఇప్పుడు 7 నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితిపై 3.00% వడ్డీ రేటు, 30 నుంచి 45 రోజుల మధ్య ఉండే వాటిపై 3.50% వడ్డీ రేటును ఇస్తోంది. 46 నుంచి 60 రోజుల వ్యవధికి 4.25% వడ్డీ రేటు ఇస్తుంది. 61 నుంచి 90 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 4.50% వడ్డీ రేటు వర్తిస్తుంది. 91 నుంచి 184 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు 4.75% వడ్డీ రేటును అందిస్తాయి. అయితే 185 నుంచి 270 రోజులలో మెచ్యూర్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటును అందిస్తాయి.

అలాగే 1 సంవత్సరం నుంచి 15 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70% వడ్డీ రేటును ఐసీఐసీఐ బ్యాంక్ ఇస్తుంది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే వాటిపై 6.00% వడ్డీ రేటును కూడా చెల్లిస్తుంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలపై గరిష్ట వడ్డీ రేటు 7.20% అందిస్తోంది. బ్యాంక్ 2 సంవత్సరాల ఒక రోజు నుంచి 5 సంవత్సరాల వరకు 7.00% రాబడిని అందిస్తుంది. ఐదు సంవత్సరాలలో ఒక రోజు నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఇప్పుడు 7.00% ఉంటుంది.

డెవిడెండ్ విడుదల..

ఏప్రిల్ 27, 2024న జరిగిన ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఒక్కో ఈక్విటీ షేర్‌కి రూ. 10 తుది డివిడెండ్‌ను అందించేందుకు సిఫార్సు చేసినట్లు బ్యాంక్ ప్రకటించింది. బోర్డు సిఫార్సు చేసిన ఈ డివిడెండ్, ఆగస్టు 29, 2024న జరగనున్న30వ వార్షిక సాధారణ సమావేశంలో ఆమోదం పొందితే అది వాటాదారులకు చెల్లిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..