Hyundai Creta Knight: హ్యూందాయ్ నుంచి కొత్త కారు లాంచ్.. ఆల్ బ్లాక్ థీమ్‌తో అదరగొడుతోందిగా..

|

Sep 06, 2024 | 5:53 PM

కాగా ఈ కారును ఇప్పుడు హ్యూందాయ్ అప్ గ్రేడ్ చేసింది. హ్యూందాయ్ క్రెటా కైట్ లిమిటెడ్ ఎడిషన్ పేరిట దీనిని లాంచ్ చేసింది. రూ. 14.50లక్షలు(ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ లో అత్యధికంగా స్టైలింగ్ మీద ఫోకస్ పెట్టారు. పాత క్రెటాతో పోల్చితే దీనిలో అనేక రకాల విజువల్ అప్ గ్రేడ్స్ కనిపిస్తున్నాయి.

Hyundai Creta Knight: హ్యూందాయ్ నుంచి కొత్త కారు లాంచ్.. ఆల్ బ్లాక్ థీమ్‌తో అదరగొడుతోందిగా..
Hyundai Creta Knight
Follow us on

మన దేశంలో హ్యూందాయ్ క్రెటా మోడల్ కు మంచి డిమాండ్ ఉంది. హ్యూందాయ్ మోటార్ ఇండియా కంపెనీ నుంచి అత్యంత అధికంగా అమ్ముడవుతున్న కారు కూడా ఇదే. కాగా ఈ కారును ఇప్పుడు హ్యూందాయ్ అప్ గ్రేడ్ చేసింది. హ్యూందాయ్ క్రెటా కైట్ లిమిటెడ్ ఎడిషన్ పేరిట దీనిని లాంచ్ చేసింది. రూ. 14.50లక్షలు(ఎక్స్ షోరూం) ప్రారంభ ధరతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ లో అత్యధికంగా స్టైలింగ్ మీద ఫోకస్ పెట్టారు. పాత క్రెటాతో పోల్చితే దీనిలో అనేక రకాల విజువల్ అప్ గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎస్ యూవీలో పాత మోడళ్లో ఉన్న మెకానికల్స్, డైమెన్షన్స్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. స్టైలింగ్, లుక్ విషయంలో ఏకంగా 21 మార్పులు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హ్యూందాయ్ క్రెటా నైట్‌లో కొత్తగా ఏమున్నాయంటే..

ఈ కొత్త మోడల్ స్టన్నింగ్ ఆల్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తోంది. ఇన్ సైడ్, అవుట్ సైడ్ ఇదే కాంబినేషన్లో ఉంటుంది. ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే డార్క్ థీమ్ డిజైన్ తో వస్తుంది. బ్లాక్డ్ అవుట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్స్, మ్యాట్ బ్లాక్ హ్యూందాయ్ లోగో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కూడా బ్లాక్ థీమ్ ఉంటుంది. బ్లాక్డ్ అవుట్ ఆర్వీఎం, రూఫ్ రెయిల్స్, 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ సైడ్ సిల్స్, సీ పిల్లర్ గార్నిష్ ఉంటుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే కారు లోపల కూడా డార్క్ థీమ్ తోనే ఉంటుంది. ఆల్ బ్లాక్ క్యాబిన్, బ్రాస్ కలర్డ్ ఇన్ సర్ట్స్, మెటల్ పెడల్స్, లెదర్ తో కూడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ కి బ్రాస్ స్టిచ్చింగ్ ఇచ్చారు.

హ్యూందాయ్ క్రెటా నైట్ ఇంజిన్..

ఇక ఇంజిన్ విషయానికి వస్తే రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఐవీటీ, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఏటీలతో అందుబాటులో ఉంటుంది.

హ్యూందాయ్ క్రెటా నైట్ ధరలు..

ఈ ప్రత్యేక ఎడిషన్ కారు వేరియంట్ ను బట్టి రూ. 14.50లక్షలు నుంచి రూ. 20.14లక్షల వరకూ ఉంటుంది. టైటాన్ గ్రే మ్యాట్ కలర్ కోసం రూ. 5000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డ్యూల్ టోన్ పెయింట్ కోసం రూ. 15,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

క్రెటా నైట్ పెట్రోల్ వేరియంట్లలో ఎస్(ఓ) ఎంటీ ధర రూ. 14.5లక్షలు, ఎస్(ఓ) ఐవీటీ వేరియంట్ ధర రూ. 17.42లక్షలు, ఎస్ఎక్స్(ఓ) ఐవీటీ ధర రూ. 18.88లక్షలు. అదే సమయంలో డీజిల్ ఇంజిన్లలో ఎస్(ఓ) ఏటీ ధర రూ. 17.58లక్షలు, ఎస్ఎక్స్(ఓ) ఎంటీ ధర రూ. 18.9లక్షలు, ఎస్ఎక్స్(ఓ) ఏటీ ధర రూ. 20.14లక్షల వరకూ ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్ షోరూం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..