Income Tax: ట్యాక్స్ రీఫండ్ ఇంకా జమ కాలేదా? స్టేటస్‌ను ఇలా తనిఖీ చేసుకోండి..

|

Aug 04, 2024 | 5:27 PM

ఆదాయపు పన్ను రీఫండ్ ప్రక్రియను రెండు ప్రాథమిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. అవి ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) వెబ్‌సైట్, అధికారిక ఆదాయపు పన్ను శాఖ పోర్టల్. ఈ రెండింటిలో దేని నుంచైనా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కానీ పాన్ కార్డు తప్పనిసరిగా కావాలి.

Income Tax: ట్యాక్స్ రీఫండ్ ఇంకా జమ కాలేదా? స్టేటస్‌ను ఇలా తనిఖీ చేసుకోండి..
Income Tax
Follow us on

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ఐటీఆర్) ఫైల్ చేసేందుకు గడువు ముగిసింది. జూలై 31వ తేదీ నాటికి ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేశారో ఆ పన్ను చెల్లింపుదారులంతా తమ ట్యాక్స్ రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడు తమ ఖాతాలో రీఫండ్ జమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ టెన్షన్ లేకుండా పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ ఓ అవకాశాన్ని కల్పించింది. రీఫండ్ స్టేటస్ ఆన్ లైన్లోనే తనిఖీ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. కేవలం పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్ కార్డు) ద్వారా చాలా సులభంగా తన రీఫండ్ స్టేటస్ తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పడు తెలుసుకుందాం..

ట్యాక్స్ రీఫండ్ స్టేటస్..

ఆదాయపు పన్ను రీఫండ్ ప్రక్రియను రెండు ప్రాథమిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. అవి ఎన్ఎస్డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) వెబ్‌సైట్, అధికారిక ఆదాయపు పన్ను శాఖ పోర్టల్. ఈ రెండింటిలో దేని నుంచైనా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కానీ పాన్ కార్డు తప్పనిసరిగా కావాలి. అలాగే అసెస్మెంట్ సంవత్సరం ఇయర్ కూడా తెలిసి ఉండాలి.
అలాగే రీఫండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు జమ కావాలంటే, మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఎంఐసీఆర్ కోడ్/ఐఎఫ్ఎస్సీ కోడ్, సరైన చిరునామాను అందించడం చాలా అవసరం. పన్ను మదింపు అధికారి రీఫండ్ బ్యాంకర్‌కు పంపిన 10 రోజుల తర్వాత పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. మీ రీఫండ్‌ని విజయవంతంగా ప్రాసెస్ కావాలంటే మీ పాన్ కార్డ్ వివరాలు, ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి.

రీఫండ్ స్టేటస్ తనిఖీ చేసే విధానం..

  • ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా..
  • అధికారిక ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • మీ పాన్ వివరాలతో లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తర్వాత, ‘మై అకౌంట్’ సెక్షన్‌ను గుర్తించి, దానిపై క్లిక్ చేయండి.
  • “రీఫండ్/డిమాండ్ స్థితి” బటన్‌పై క్లిక్ చేయండి.
  • అసెస్‌మెంట్ సంవత్సరం, ప్రస్తుత స్థితి, ఏవైనా రీఫండ్ వైఫల్యాలకు గల కారణాలు, చెల్లింపు విధానం వంటి వివరాలతో సహా మీ ఆదాయపు పన్ను రీఫండ్ స్థితిని మీరు చూస్తారు.

 

  • ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్ ద్వాారా..
  • NSDL TIN వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • మీ పాన్ వివరాలతో లాగిన్ చేయండి.
  • డ్రాప్‌డౌన్ మెనూ నుంచి మీరు రీఫండ్ స్టేటస్ ను తనిఖీ చేయాలనుకుంటున్న అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి.
  • స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • తర్వాత, ‘సబ్మిట్’ బటన్‌ను క్లిక్ చేయండి.
  • మీ ఐటీఆర్ రీఫండ్ స్థితిని సూచించే సందేశం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దానిని వీక్షించడానికి ‘కంటిన్యూ’ పై క్లిక్ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..