Fuel Saving: మీ కారు బాగా మైలేజీ ఇవ్వాలంటే ఈ చిన్న టెక్నిక్‌ను ఉపయోగించండి..

|

Jun 08, 2024 | 3:24 PM

రోడ్డుపై కారులో ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వేచి ఉండడం సాధారణమే. ట్రాఫిక్ క్లియర్ అయ్యి మిగిలిన వాహనాలు వెళ్లే వరకూ అక్కడే ఉండాలి. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు స్టార్టర్, బ్యాటరీని జీవిత కాలాన్నీ కాపాడుకోనే అవకాశం ఉంటుంది.

Fuel Saving: మీ కారు బాగా మైలేజీ ఇవ్వాలంటే ఈ చిన్న టెక్నిక్‌ను ఉపయోగించండి..
Petrol
Follow us on

ఆధునిక జీవనశైలి, అవసరాలలో భాగంగా కారు వినియోగం అనేది ఇప్పుడు చాలామందికి తప్పనిసరిగా మారింది. గతంలో ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండే కార్లు నేడు సామాన్య, మధ్యతరగతి వారికీ అందుబాటులో వచ్చాయి. కార్ల కొనడంతో పాటు వాటి సక్రమంగా నిర్వహించడం చాలా అవసరం. ముఖ్యంగా ఇంధనాన్ని ఆదా చేయడానికి చర్యలు తీసుకోవాలి.

ప్రయోజనం..

రోడ్డుపై కారులో ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వేచి ఉండడం సాధారణమే. ట్రాఫిక్ క్లియర్ అయ్యి మిగిలిన వాహనాలు వెళ్లే వరకూ అక్కడే ఉండాలి. ఆ సమయంలో ఇంజిన్ ఆఫ్ చేయడం చాలా ఉత్తమం. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు స్టార్టర్, బ్యాటరీని జీవిత కాలాన్నీ కాపాడుకోనే అవకాశం ఉంటుంది.

ఆర్థిక భారం..

ప్రస్తుతం ఇంధన ధరలు ఎక్కువగా ఉండడంతో కారు నిర్వహణ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇంధనం ఆదా అనేది చాలా అవసరం. ప్రయాణంలో మీరు జాగ్రత్తగా, నిర్ణీత వేగంలో వెళితే మైలేజీ బాగా ఉంటుంది. దానితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంజిన్‌ను ఆఫ్ చేయడం చాలా అవసరం.

స్టార్ట్/స్టాప్ సిస్టమ్..

ఈ విషయాన్ని కార్ల తయారీ సంస్థలు కూడా గుర్తించాయి. ఆధునిక కార్లలో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ను అందుబాటులో తీసుకువచ్చాయి. దీని ద్వారా కార్ల యజమానులకు ఎంతో మేలు జరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ లో వాహనం ఆగినప్పుడల్లా ఇంజిన్‌ను ఆపివేస్తుంది. డ్రైవర్ బ్రేక్‌ను వదిలిన వెంటనే మళ్లీ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ కన్సోల్ లేదా డ్యాష్‌బోర్డ్‌లో ఒక బటన్ ఉంటుంది. ఇది డ్రైవర్‌ ఆదేశాల అనుగుణంగా సిస్టమ్ ను పనిచేసేలా చేస్తుంది.

ఇంధనం ఆదా ..

డ్రైవింగ్ చేసే విధానం, యాక్టివేషన్ అనేవి ఇంధనం ఆదా చేయడానికి చాలా కీలకం. ముఖ్యంగా పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని వల్ల దాదాపు పదిశాతం ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఈ సిస్టమ్ తో మరో ప్రయోజనం ఏమిటంటే ఇది ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌లో ఎలక్ట్రికల్ స్టార్టర్ శక్తివంతంగా పని చేస్తుంది.

ప్రత్యేక పరిస్థితులు..

కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న సమయంలో హీట్ కోసం, అలాగే ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ పనిచేయాలంటే ఇంజిన్ ఆగకూడదు. అలాంటి సమయాలలో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ను యాక్టివేట్ రాకుండా చూసుకోవచ్చు.

ఉత్తమ విధానం..

స్టార్ట్/స్టాప్ లేని పాత టెక్నాలజీ వాహనాన్ని ఉపయోగించేవారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మాన్యువల్ గా ఇంజిన్ ను ఆఫ్ చేయాలి. సాధారణంగా పాత టెక్నాలజీ ఇంజిన్ గంటకు లీటర్ ఇంధనాన్ని వినియోగిస్తుంది. దాదాపు 20 సెకన్ల కన్నా ఎక్కువ సేపు వాహనాన్ని నిలుపుదల చేయాల్సి వస్తే ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్‌లో ఆగిపోయిన ప్రతిసారీ ఇంజిన్‌ను ఆపివేస్తే ఇంధనాన్ని ఆదా చేయగలరు. అయితే స్టార్ట్/స్టాప్ లేని వాహనాలను కొన్ని సెకన్ల పాటు కాకుండా, కొన్ని నిమిషాల పాటు ఆగిన సమయంలోనే ఇంజిన్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..