7th Pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 4శాతం వరకూ డీఏ పెంపు..

|

Aug 04, 2024 | 3:41 PM

ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కనీసం 3శాతం వరకూ పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024, జూలై 1 నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది.

7th Pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 4శాతం వరకూ డీఏ పెంపు..
Cash
Follow us on

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కనీసం 3శాతం వరకూ పెంచే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2024, జూలై 1 నుంచి ఈ పెంచిన డీఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3శాతం డీఏ అయితే ఖాయమని.. అవకాశాన్ని బట్టి అది 4శాతానికి పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 నుంచి 4శాతం వరకూ డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ప్రకటించే అవకాశం ఉందని.. 3శాతం పెంపును ద్రవీకరించినా.. అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది 4శాతానికి కూడా పెరగవచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం ఎంత ఉంది అంటే..

ప్రస్తుతం, డియర్‌నెస్ అలవెన్స్ బేసిక్ పేలో 50 శాతంగా ఉంది. 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పేతో డీఏను విలీనం చేస్తారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపై అందుతున్న సమాచార ప్రకారం.. 50 శాతానికి మించి డియర్‌నెస్ అలవెన్స్ విషయంలో డిఏ బేసిక్ పేతో విలీనం చేసే అవకాశం లేదని తెలుస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పడే వరకు ఇది యథాతథంగా కొనసాగుతుంది. విలీనానికి బదులుగా, డీఏ 50 శాతం దాటితే, హెచ్‌ఆర్‌ఏతో సహా భత్యాలను పెంచే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గతంలో 4వ పే కమిషన్ సమయంలో డీఏ అత్యధికంగా 170శాతానికి చేరుకుంది. దీని ఆధారంగానే ఇప్పుడు చేస్తారనే వాదన వినిపిస్తోంది.

గతంలో డీఏ పెంచినప్పుడు అంటే 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను బేసిక్ పేలో 4 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ప్రభుత్వం డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ని కూడా 4 శాతం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తారు. జనవరి, జూలై నుంచి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి రెండుసార్లు డీఏ, డీఆర్ లను పెంచుతారు. ఈ క్రమంలో 2024 బడ్జెట్ సమావేశాలకు ముందు 8వ వేతన సంఘం తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. అందులో 8వ వేతన సంఘం ఏర్పాటు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించడం వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 30న రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలలో ప్రస్తుతం ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. కాబట్టి కాబట్టి, 8వ వేతన సంఘం రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రతిపాదన లేదు.

7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చాయి. సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..