BMW Electric Car: ఊసరవెల్లే అనుకుంటే దాని బాబులా ఉందే ఈ కారు! క్షణాల్లో రంగులు మార్చేస్తుంది.. మాటలు చెబుతోంది..

| Edited By: Anil kumar poka

Jan 06, 2023 | 4:02 PM

అయితే ఊసరవెల్లిలా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా? రోడ్డుపై ఉన్న పరిస్థితుల బట్టి, మూడ్ ని బట్టి కారులో వివిధ భాగాలు తన రంగులను మార్చుకోవడం ఎక్కడైనా గమనించారా?

BMW Electric Car: ఊసరవెల్లే అనుకుంటే దాని బాబులా ఉందే ఈ కారు! క్షణాల్లో రంగులు మార్చేస్తుంది.. మాటలు చెబుతోంది..
BMW
Follow us on

ఊసరివల్లి.. తన చుట్టూ పరిస్థితులను బట్టి రంగులు మార్చుకుంటూ ఉంటుందని అందరికీ తెలుసు. పరిస్థితులను బట్టి మాట మార్చే మనుషులను కూడా వాటితో పోల్చుతుంటారు. ‘అరే వీడు ఊసరివెల్లి లాంటోడు రా’ అంటూ ఉంటారు. అయితే ఊసరవెల్లిలా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా? రోడ్డుపై ఉన్న పరిస్థితుల బట్టి, మూడ్ ని బట్టి కారులో వివిధ భాగాలు తన రంగులను మార్చుకోవడం ఎక్కడైనా గమనించారా? లేదు కదా.. ప్రపంచంలో నే మొట్టమొదటి సారిగా ఇలాంటి కారును ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ వాహన వేరియంట్లో దీనిని విడుదల చేసింది. లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)లో దీనిని ప్రదర్శించింది. ప్రస్తుతం ఇది అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది. ఆ కారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పేరు ఏంటంటే..

బీఎండబ్ల్యూ ఐ విజన్ డీ పేరుతో కొత్త రకం ఎలక్ట్రిక్ కారును ఆ కంపెనీ ఆవిష్కరించింది. మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో మిడ సైజ్ సెడాన్ రకం కారు ఇది.

అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో..

ప్రస్తుతం మనం చూస్తున్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన కార్లలో ఆటో డ్రైవ్, డిజిటల్ ఫంక్షనింగ్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ బీఎండబ్ల్యూ చెందిన కారు అంతకు మించి.. అన్నట్లు ఉంటుంది. ఈ కారు పరిస్థితులు, మూడ్స్ ను బట్టి తన రంగులు మార్చుకోవడంతో పాటు, ఎదుటి వాహనాల పరిస్థితులను కూడా డ్రైవర్ కు వివరిస్తుంది. అంటే లిటరల్ గా డ్రైవర్ తో ఈకారు మాట్లుడుతుంది.

ఇవి కూడా చదవండి

32 రంగుల్లో..

ఈ కారు ఐ3 సెడాన్ శ్రేణికి చెందిన నియో క్లాసీ ఆర్కిటెక్చర్ తో వస్తుంది. దీనిలోని దాదాపు 240 భాగాలు 32 రంగుల్లో తన రూపును మార్చుకోగలగుతుంది. చక్రాల దగ్గర నుంచి టాప్ రూఫ్ వరకూ వివిధ భాగాలు , రకరకాల రంగులను మార్చుకుంటుంది. దీని హెడ్ లైట్స్, గ్రిల్ వివిధ రకాల మూడ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తాయి. అంతేకాక ఈ కారు జనాలతో మాట్లాడుతుంది కూడా. దీని కోసం కారు సైడ్ విండోస్ వద్ద డ్రైవర్ అనుసంధానంగా డిజిటల్ అవతార్ ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లు, ధర వచ్చే ఏడాది ప్రకటించే అవకాశం ఉందని ఆ కంపెనీ తెలిపింది. అలాగే 2025 నాటికి దీనిని మార్కెట్లోకి తీసుకోచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..