ఎయిర్ టెల్ కస్టమర్స్‌కి ఇక పండగే.. విషయం తెలిస్తే మీరు కూడా..!

| Edited By:

Dec 08, 2019 | 2:41 AM

ఇటీవల ఉన్నట్టుండి ఒక్కసారిగా టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఉన్న అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ విషయంలో.. ఇప్పుడు పరిమితులు విధించి.. ఆ తర్వాత ఛార్జీల మోతకు శ్రీకారం చుట్టారు. దీంతో ఒక్కసారిగా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ వినయోగదారులకు ఓ మంచి కాఫీలాంటి వార్తను అందించింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్కులకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్‌ విషయంలో.. అన్‌లిమిటెడ్‌ […]

ఎయిర్ టెల్ కస్టమర్స్‌కి ఇక పండగే.. విషయం తెలిస్తే మీరు కూడా..!
Follow us on

ఇటీవల ఉన్నట్టుండి ఒక్కసారిగా టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు ఉన్న అన్ లిమిటెడ్ అవుట్ గోయింగ్ కాల్స్ విషయంలో.. ఇప్పుడు పరిమితులు విధించి.. ఆ తర్వాత ఛార్జీల మోతకు శ్రీకారం చుట్టారు. దీంతో ఒక్కసారిగా వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ వినయోగదారులకు ఓ మంచి కాఫీలాంటి వార్తను అందించింది.

ఇక నుంచి ఇతర నెట్‌వర్కులకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్‌ విషయంలో.. అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. ఇటీవల డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన న్యూప్లాన్లలో ఈ మేరకు మార్పులు చేపట్టింది. ఇటీవల ప్రీపేయిడ్ ధరలకు దాదాపు 50 శాతం వరకు పెంచుతూ వినియోగ దారులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో పలు న్యూ ప్లాన్స్‌ను కస్టమర్స్‌కు ఇంట్రడ్యూస్ చేసింది. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల ప్లాన్‌పై 3000, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 12వేల నిమిషాల పరిమితిని విధించింది. ఇక ఆ పరిమితి దాటితే.. ఇతర నెట్ వర్క్స్‌కు చేసే అన్ని కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇక నుంచి అన్ని నెట్‌వర్క్స్‌కు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చంటూ ఎయిర్ టెల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతేకాదు.. దీనికి ఎలాంటి కండిషన్స్ కూడా లేవంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఇటీవల అన్ని మొబైల్ ఆపరేటర్లు వారి వారి ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని నెట్‌వర్క్స్‌ అన్ లిమిటెడ్ కాల్స్‌పై పరిమితులు విధించారు. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్ ఇలా ఆఫర్ ఇవ్వడంతో.. మిగతా నెట్‌వర్క్స్‌లో ఉన్న వినియోగదారులు కూడా ఎయిర్‌టెల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి మిగతా ఆపరేటర్లు కూడా ఎయిర్ టెల్ బాటలో నడుస్తాయో లేదో అన్నది చూడాల్సిందే.