మరి కాసేపట్లో.. నిర్మలమ్మ బడ్జెట్.. సవాళ్ల ముళ్ళు ఎన్నో !

| Edited By: Anil kumar poka

Feb 01, 2020 | 11:43 AM

2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించనున్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచాయిలో. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా ఉల్లి ధరలతో బాటు రిజర్వ్ బ్యాంకు తీసుకున్న చర్యలను ఏ మాత్రం ప్రభావితం, చేయలేకపోయాయి. ఆదాయం, వ్యయం మరీ దారుణంగా పడిపోయాయి. ఆర్ బీ ఐ […]

మరి కాసేపట్లో.. నిర్మలమ్మ బడ్జెట్.. సవాళ్ల ముళ్ళు ఎన్నో !
Follow us on

2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించనున్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచాయిలో. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా ఉల్లి ధరలతో బాటు రిజర్వ్ బ్యాంకు తీసుకున్న చర్యలను ఏ మాత్రం ప్రభావితం, చేయలేకపోయాయి. ఆదాయం, వ్యయం మరీ దారుణంగా పడిపోయాయి.

ఆర్ బీ ఐ అంచనా ప్రకారం.. ఈ నిష్పత్తి గత ఏడాది రెండో త్రైమాసికంలో 97.30 పాయింట్లు ఉండగా మూడో త్రైమాసికానికి అది 89.40 పాయింట్లు తగ్గిపోయింది. ఈ విషయాన్ని  సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంకే వెల్లడించింది. వచ్ఛే ఐదేళ్లకు గాను మౌలిక సదుపాయాల రంగంలో ఇప్పటికే ప్రకటించిన రూ. 105 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడానికి రోడ్ మ్యాప్ ను నిర్మలా సీతారామన్ ప్రకటించవచ్చు.   ఇది రానున్న అయిదేళ్ల కాలానికి దేశ ఆర్ధిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల మేర సాధించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. రోడ్లు, రైల్వే, పోర్టుల అభివృధ్దికి ప్రధాని మోదీ నిధుల కేటాయింపును పెంచుతున్నట్టు గతంలోనే ప్రకటించారు.  డిజిన్వెస్టి మెంట్ లో భాగంగా ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థల వాటాలను అమ్ముతున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది కూడా..దీంతో సహజంగానే ప్రయివేటీకరణకు పెద్ద పీట వేసినట్టే.. ఇక బ్యాంకింగ్ రంగ సంస్కరణల విషయానికే వస్తే.. వీటి గురించి గత బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ.. ఇవి నత్తనడకన సాగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు బ్యాంకులు తాజాగా రుణాలను అందించలేకపోతున్నాయి. వీటి  నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచవచ్చునన్నది ఓ ఆశా కిరణంగా కనిపిస్తోంది. దేశంలో మధ్యా దాయ వర్గాలే ఎక్కువన్న విషయం గమనార్హం. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండో సారి..