పెళ్లి కాలేదని.. అరటి తోటలో క్షుద్రపూజలు !

తూర్పు గోదావరి జిల్లాలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం రేగింది. దీంతో అమలాపురం మండలం బండారులంక గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో అర్థరాత్రివేళ అరటితోట మధ్య పూజలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు పదుల సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. పూజలు చేస్తున్న వాళ్లపై గ్రామస్థులు దాడికి దిగారు. అర్థరాత్రి వేళ అరటితోటలో పూజలేంటంటూ నిలదీశారు. పూజారులు, పూజలు జరిపించుకుంటున్న వాళ్లపై విరుచుకుపడ్డ గ్రామస్థులు పూజాసామాగ్రిని విసిరేశారు. అయితే బాదితులు మాత్రం పెళ్లి కాలేదని.. దాని దోష నివారణ కోసం […]

పెళ్లి కాలేదని.. అరటి తోటలో క్షుద్రపూజలు !
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 1:06 PM

తూర్పు గోదావరి జిల్లాలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం రేగింది. దీంతో అమలాపురం మండలం బండారులంక గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామంలో అర్థరాత్రివేళ అరటితోట మధ్య పూజలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు పదుల సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకున్నారు. పూజలు చేస్తున్న వాళ్లపై గ్రామస్థులు దాడికి దిగారు. అర్థరాత్రి వేళ అరటితోటలో పూజలేంటంటూ నిలదీశారు. పూజారులు, పూజలు జరిపించుకుంటున్న వాళ్లపై విరుచుకుపడ్డ గ్రామస్థులు పూజాసామాగ్రిని విసిరేశారు.

అయితే బాదితులు మాత్రం పెళ్లి కాలేదని.. దాని దోష నివారణ కోసం పూజలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అయితే వారి మాటలను పట్టించుకోని గ్రామస్థులు.. ఒక్కసారిగా వాళ్లపై విరుచుకుపడ్డారు. క్షుద్రపూజలపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిలగం రామకోటేశ్వరరావు, కొండా త్రినాథరావు, రాంపల్లి దుర్గాప్రసాద్, రాంపల్లి త్రినాధ్, రాంపల్లి శివలను అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.