YSR Plenary 2022: రెండో రోజుతో ముగిసిన వైసీపీ ప్లీనరీ.. ప్రసంగాలతో హోరెత్తించిన నేతలు..!

| Edited By: Ganesh Mudavath

Jul 09, 2022 | 9:59 PM

YSR Plenary 2022: గుంటూరు జిల్లా పెదకాకానిలో రెండోరోజు వైసీపీ ప్లీనరీ కొనసాగింది. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ సంఖ్యలో పార్టీ క్యాడర్‌ తరలివచ్చినట్టు తెలుస్తోంది. కార్యకర్తలు..

YSR Plenary 2022: రెండో రోజుతో ముగిసిన వైసీపీ ప్లీనరీ.. ప్రసంగాలతో హోరెత్తించిన నేతలు..!
Follow us on

YSR Plenary 2022: గుంటూరు జిల్లా పెదకాకానిలో రెండోరోజు వైసీపీ ప్లీనరీ కొనసాగింది. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ సంఖ్యలో పార్టీ క్యాడర్‌ తరలివచ్చినట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు సైతం.. ప్లీనరీ కోసం తరలిరావడం విశేషం. తొలిరోజు నాలుగు రంగాలపై తీర్మానాలు ఆమోదించిన వైసీపీ ప్లీనరీ.. రెండు రోజు మరో ఐదు తీర్మానాలు ఆమోదించింది. పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, సామాజిక న్యాయం, దుష్ట చతుష్టయంపై ప్లీనరీ తీర్మానాలు చేసింది. శుక్రవారం జరిగిన తొలిరోజు ప్లీనరీలో.. మహిళ సాధికారత , దిశ చట్టం.. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. డిబిటి పథకాలు అమలుపై ప్లీనరీ తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ, ఇప్పటికే పరిపాలన వికేంద్రీకరణ పారదర్శకత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ప్రసంగించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. తండ్రిని మించిన తనయుడిగా వైఎస్‌ జగన్‌.. సంక్షేమపథంలో దూసుకెళ్తున్నారనీ.. ప్రశంసించారు. కచ్చితంగా మరోసారి ప్రజలు జగన్‌ను ఆశీర్వదిస్తారనీ ధీమా వ్యక్తం చేశారు.

నేతల ప్రసంగాలు..

రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్‌ నామస్మరణే వినిపిస్తోందని చెప్పారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై మొదటగా ప్రసగించిన తమ్మినేని.. మూడేళ్ల ప్రగతిపై సమీక్షే ఈ ప్లీనరీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యమన్నారు. అయితే, స్పీకర్‌ పదవిలో ఉంటూ ప్లీనరికి ఎలా హాజరవుతారంటూ ప్రశ్నించిన ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇచ్చారు తమ్మినేని. తాను ముందు వైసీపీ కార్యకర్తననీ.. ఆ తర్వాతే స్పీకర్‌ననీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ప్లీనరీ ప్లీనరీకి.. వైసీపీ మరింత దృఢంగా మారుతోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎంతో కృషిచేసిన జగన్‌ రూపొందించిన ఈ రాజకీయ పక్షాన్ని ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్లీనరీ వేదికగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విరుచుపడిన అంబటి.. ఎవరైనా పార్టీ పెడితే తాము అధికారంలోకి రావాలనుకుంటారనీ.. కానీ, పవన్‌ మాత్రం చంద్రబాబు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జగన్‌ మంచి చేస్తుంటే.. ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదన్నారు మంత్రి జోగి రమేశ్‌. కోర్టు స్టేల పేరుతో చంద్రబాబు.. సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్లీనరీ వేదికగా విపక్షాలను టార్గెట్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. గ్రాఫిక్స్‌లో అమరావతి అభివృద్ధిని చూపించింది చంద్రబాబయితే.. ఇప్పుడు నిజంగా పనిచేసిసి చూపిస్తున్నది జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తగ్గేదెలె అన్నట్టు దూసుకెళ్తున్నారని ప్రశంసించారు. రెండో రోజు ప్లీనరీలో.. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ను ఎన్నుకుంది వైసీపీ.

వైసీపీ రెండో రోజు ప్లీనరీలో తొలిరోజును మించి పాల్గొన్నారు కార్యకర్తలు. సభా ప్రాంగణలో భారీగా వర్షం కురిసినా వెనక్కి తగ్గలేదు. భారీ సంఖ్యలో తరలించారు. ఈ సందర్భంగా ఆప్రాంగణమంతా.. ఆకాశంలో తేలుతూ కనిపించిన వైసీపీ ఎయిర్‌ బెలూన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైసీపీ ప్లీనరీకి రెండోరోజు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. లక్షలమంది వాహనాల్లో తరలిరావడంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు బారులు తీరాయి. ప్లీనరీ అయిపోయిన తర్వాత కూడా వేల కొద్దీ వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయింది.‌

ట్రాఫిక్ జామ్..

వైసీపీ ప్లీనరీకి రెండోరోజు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. లక్షలమంది వాహనాల్లో తరలిరావడంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు బారులు తీరాయి. ప్లీనరీ అయిపోయిన తర్వాత కూడా వేల కొద్దీ వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి