Kala Venkat Rao Arrest: కళా వెంకట్రావును అందుకే అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది.. చట్టం ముందు అందరూ సమానమే

|

Jan 21, 2021 | 7:34 AM

మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకట్రావు అరెస్ట్‌పై విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి స్పష్టతనిచ్చారు. నెల్లిమర్ల పోలీసు స్టేషనులో..

Kala Venkat Rao Arrest: కళా వెంకట్రావును అందుకే అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది.. చట్టం ముందు అందరూ సమానమే
Follow us on

మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకట్రావు అరెస్ట్‌పై విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి స్పష్టతనిచ్చారు. నెల్లిమర్ల పోలీసు స్టేషనులో ఈ నెల రెండవ తేదీన ఎంపి విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని తెలిపారు.

విచారణ నిమిత్త కిమిడి కళా వెంకటరావుని హాజరు కావాల్సిందిగా పోలీసులు పలుమార్లు కోరారు. కళా వెంకటరావు పోలీసులకు సహకరించలేదు. పలుమార్లు కోరినా సరిగా స్పందించనందున దర్యాప్తులో భాగంగా కళావ వెంకట్రావును పిలిచి అనంతరం 41సి నోటీసు ఇచ్చి తిరిగి పంపాము

ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని ఎస్పీ రాజకుమారి తెలిపారు.