కరోనా నెగిటివ్‌.. నా వద్ద కూరగాయలు కొనొచ్చు

| Edited By:

Aug 26, 2020 | 8:45 AM

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అందరిలో తెలీకుండానే పలు సందేహాలు మెదులుతున్నాయి.

కరోనా నెగిటివ్‌.. నా వద్ద కూరగాయలు కొనొచ్చు
Follow us on

Vegetable Vendor Certificate: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అందరిలో తెలీకుండానే పలు సందేహాలు మెదులుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, కొందరికీ తెలీకుండానే వైరస్ సోకుతుండటంతో బయటకు వెళ్లేందుకు కూడా సాహసం చేయడం లేదు. ఇక పలు రాష్ట్రాల్లో మార్కెట్ల నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో.. కూరగాయలకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఉట్నూరుకు చెందిన కూరగాయల వ్యాపారి డోలి శంకర్‌ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.

కరోనా పరీక్షలు చేయించుకొని ఆ సర్టిఫికేట్‌ని అందరికీ కనిపించేలా దుకాణం ముందు ఫ్రేమ్ కట్టించాడు. పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని, భయపడకుండా తన వద్ద కూరగాయలు కొనొచ్చు అంటూ భరోసా ఇస్తున్నాడు. ఇక డోలి శంకర్‌ ప్రయత్నం పలువురిని మెప్పించగా.. అక్కడున్న మిగిలిన కూరగాయల వ్యాపారులు కూడా అతడి బాటలోనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More:

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన కీలక పత్రాలు

జేఈఈ-నీట్ పరీక్షలు: మార్గదర్శకాలు విడుదల